
తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో 81 మంది నామినేషన్లు సరైనవని తేల్చారు.130 మంది నామినేషన్లను రిటర్నింగ్ ఆఫీసర్ తిరస్కరించారు. బుధవారం ఉదయం మొదలైన నామినేషన్ల పరిశీలన.. గురువారం తెల్లవారుజామున 3 గంటల వరకు కొనసాగింది.17 గంటల పాటు నామినేషన్ల స్క్రూటి ప్రక్రియ జరిగింది.
జూబ్లీహిల్స్ లో మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. నిరుద్యోగులు, ట్రిపుల్ ఆర్ బాధితులు, ఫార్మా బాధితులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున నామినేషన్లు వేశారు. తమ సమస్యలు పరిష్కరించలేదంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్లంతా జూబ్లీహిల్స్ బరిలో నిలిచారు. అయితే సరైన డాక్యూమెంట్లు సమర్పించకపోవడంతో వీటిలో దాదాపుగా 90 శాతం నామినేషన్లు తిరస్కరణకు గుర్యయ్యాయి.
స్క్రూటినీ అనంతరం 81 మంది అభ్యర్థుల 135 నామినేషన్లను ఖరారు చేశారు ఎన్నికల అధికారి.వివిధ కారణాలతో 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నామినేషన్ల విత్ డ్రాకు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఉంది.