ఆంధ్ర ప్రదేశ్

జగన్‌తో జాగ్రత్తగా ఉండండి - పార్టీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. కూటమి వర్సెస్‌ వైసీపీ… ఇదే ఏపీలో జరుగుతున్న రాజకీయం. మూడు పార్టీలు ఒక వైపు… వైసీపీ మరోవైపు. అయినా… జగన్‌ను లైట్‌ తీసుకోవద్దని అంటున్నారు సీఎం చంద్రబాబు. నిన్న (శుక్రవారం) జరిగిన టీడీఎల్పీ సమావేశంలో… జగన్‌తో జాగ్రత్త అని… పార్టీ నేతలను గట్టిగానే హెచ్చరించారు. వైసీపీ కుట్ర రాజకీయాలపై అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.

నిన్నటి (శుక్రవారం) టీడీఎల్పీ సమావేశంలో… సీఎం చంద్రబాబు కొత్త పల్లవి అందుకున్నారు. ఎప్పుడూ… పార్టీ బలోపేతం గురించి, ప్రజల్లో ఎలా వెళ్లాలనే అంశాల గురించి మాత్రమే చర్చించే చంద్రబాబు… ఇప్పుడు మాత్రం జగన్‌పై ఫోకస్‌ పెట్టాడు. జగన్‌తో జాగ్రత్తగా ఉండాలని… లేదంటే.. నష్టపోతామని నేతలకు దిశానిర్దేశం చేశారాయన. 2019 ఎన్నికలను ఉదాహరణగా చూపించారు. అప్రమత్తంగా లేకపోవడం వల్ల.. జగన్‌ను లైట్‌ తీసుకోవడం వల్లే 2019 ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పారు చంద్రబాబు. ఈసారి అలా జరగకూడదని…. ఎలాంటి పొరపాట్లు చేయొద్దని… జగన్‌ కుట్ర రాజకీయాలతో జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు గట్టిగా చెప్పారు.

వైఎస్‌ వివేకా హత్య గురించి కూడా టీడీఎల్పీ (TDLP) సమావేశంలో చర్చించారు చంద్రబాబు. నేరాలు చేసి.. పక్కవారిపై తోసేయడం వైసీపీ నేతలకు అలవాటని.. చాలా జాగ్రత్తగా ఉండాలని పార్టీ నేతలకు సూచించారు. జగన్‌ ఒక పొలిటికల్‌ క్రిమినల్‌ అని… క్రిమినల్‌ రాజకీయాలు చేయడంలో దిట్ట అని చెప్పారట చంద్రబాబు. తమ్ముళ్లూ… జగన్‌తో బీ-కేర్‌ఫుల్‌ అని పదేపదే వార్నింగ్‌ ఇచ్చారట చంద్రబాబు. ఏ మాత్రం తప్పు జరిగినా… ఈసారి ఎన్నికల్లో మళ్లీ ఓడిపోయే అవకాశాలు ఉన్నాయని.. అందుకే పొరపాట్లకు అవకాశాలు ఇవ్వొద్దని చెప్పారట.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా పూర్తికాలేదు. ఇంకా నాలుగేళ్లు ప్రభుత్వం కొనసాగుతుంది. ఈ సమయంలో… రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమాల గురించి మాట్లాడాల్సిన సీఎం చంద్రబాబు… జగన్‌ గురించి ఎందుకు ప్రస్తావించారు. నాలుగేళ్ల తర్వాత జరిగే ఎన్నికల గురించి… వైసీపీ అధ్యక్షుడు జగన్‌ గురించి… పార్టీ నేతలను ఇప్పుడే ఎందుకు అలర్ట్‌ చేస్తున్నారు. అధికారంలో ఉండి… జగన్‌ జాగ్రత్త అని పార్టీ శ్రేణులను చెప్పాల్సిన అవసరం ఏముంది..? ఏమో మరి.. లోగుట్టు చంద్రబాబుకే ఎరుక.

ఇవి కూడా చదవండి…

  1. పోసాని తర్వాత టార్గెట్‌ ఆయననే..? సజ్జల, ఆయన కుమారుడు భార్గవ్‌ అరెస్ట్‌ తప్పదా..?

  2. మీనాక్షి నటరాజన్‌ రాకతో టీకాంగ్రెస్‌లో మార్పు వస్తుందా..? – పార్టీలో కుమ్ములాటలు తగ్గుతాయా?

  3. 3.22 కోట్లతో ఏపీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మంత్రి పయ్యావుల- కేటాయింపులు ఇలా..

  4. సెంట్రల్ జైలుకు పోసాని కృష్ణమురళీ.. నెక్స్ట్ అతనే?

  5. టన్నెల్‌లో ప్రమాదస్థలికి దగ్గరగా రెస్క్యూ టీమ్స్‌- నీరు, బురద తొలగించే పనిలో నిమగ్నం

Back to top button