
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- నకిలీ మద్యం కేసులో అధికార మరియు ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. మీరంటే మీరు.. మీరంటే మీరు అంటూ ఇరు పార్టీలు చేస్తున్న ఆరోపణలు నేడు తీవ్ర స్థాయికి చేరాయి.ఈ సందర్భంలోనే తాజాగా వైసీపీ మాజీ మంత్రి జోగి రమేష్ ఇవాళ కుటుంబ సమేతంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అయితే దర్శనం అనంతరం జోగి రమేష్ చేసిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. దర్శనం అయిపోయిన వెంటనే గుడి కిందకు వచ్చిన జోగి రమేష్ కుటుంబం మీడియా మిత్రులతో సమావేశం నిర్వహించారు. చేతిలో హారతి వెలిగించుకొని గుడి ముందే నేను ఎటువంటి తప్పు చేయలేదు అని.. ఈ కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని ఆసక్తికర సన్నివేశాలను అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తిలకించారు. కేవలం నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుట్ర పన్నుతున్నారు అని తీవ్రంగా మండిపడ్డారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారు అని తీవ్రంగా ఫైర్ అయ్యారు. కావాలంటే నేను లై డిటెక్టర్ టెస్ట్ కు కూడా సిద్ధమే అని విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తూ వెల్లడించారు. దీంతో జోగి రమేష్ చేతిలో హారతి వెలిగించి మరీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడంతో… పక్కనే చూస్తూ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా ఒకసారిగా షాక్ అయ్యారు.
Read also : టీమిండియాకు బిగ్ షాక్… ICUలో స్టార్ క్రికెటర్!
Read also : ఈ-పంచాయతీ యూనియన్ నల్లగొండ జిల్లా కొత్త భాద్యతలు





