Tuesday, February 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్జగన్ ప్యాలెస్ రెండు కోట్లు... కానీ బయట ఇనప కంచె 13 కోట్లు?

జగన్ ప్యాలెస్ రెండు కోట్లు… కానీ బయట ఇనప కంచె 13 కోట్లు?

2024వ సంవత్సరంలో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి భారీగా ఓడిపోయారు. అయితే ఈ విషయంపై చాలామంది రకాలుగా మాట్లాడుకున్న విషయం అందరికి తెలిసిందే. 2019లో ఏకంగా 153 సీట్లు సాధించి ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితం కావడం అందరిలోనూ ఆశ్చర్యం కలిగించింది.

ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఇంటికి సంబంధించి ఒక విషయం అనేది టిడిపి బయట పెట్టింది. జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి ప్యాలెస్ అనేది కేవలం రెండు కోట్లు మాత్రమే ఉంటుంది. కానీ అతను తన ఇంటి చుట్టూ వేయించుకున్న ఇనప కంచె అనేది ఏకంగా 13 కోట్లు ఉంటుందన్న సీక్రెట్ విషయాన్ని బయట పెడుతూ జీవో జారీ చేసింది టిడిపి ప్రభుత్వం. 13 కోట్లతో కంచె ఏర్పాటు చేయకపోతే ఆ 13 కోట్లతోనే దుర్భేద్యమైన ప్యాలస్ కట్టుకోవచ్చు కదా అని అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. కేవలం ఆ ఇనుప కొంచె కు 13 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రజల డబ్బుని దుర్వినియోగం చేశారని టిడిపి ప్రభుత్వం జగన్ పై మండిపడుతుంది.

ప్రస్తుతం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఇంటిలో ప్రభుత్వ ఫర్నిచర్స్ ఇంకా వాడుతున్నారని టిడిపి ప్రభుత్వం చెప్తుంది. ఏ మాత్రం జ్ఞానం ఉన్న వ్యక్తి అధికారంలో లేనప్పుడు ప్రభుత్వ వస్తువులను వాడకూడదని విషయం తెలియదా అని కూటమి ప్రభుత్వం జగన్ పై మండిపడుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments