
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం డేటా సెంటర్ ఏర్పాటు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. తాజాగా ఈ డేటా సెంటర్ పై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ డేటా సెంటర్ వల్ల చాలా అంటే చాలా తక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఈ డేటా సెంటర్ తో కేవలం ఎకో సిస్టం మాత్రమే బిల్డ్ అవుతుందని.. దీనివల్ల గ్లోబల్ కేటబిలిటీ సెంటర్స్ వస్తాయని తెలిపారు. మరోవైపు భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అనేది ప్రపంచాన్ని డామినేట్ చేయబోయేటువంటి ఒక టెక్నాలజీ అని.. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ రెండు కూడా భవిష్యత్తులో జరగబోయే గొప్ప మార్పునకు డేటా సెంటర్ అనేది కీ ఫ్యాక్టరీ అవుతుందని పేర్కొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి డేటాకు కొంచెం మైండ్ అప్లై చేస్తే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతుంది అని వివరించారు. ఈ డేటా సెంటర్ వాళ్ళ పెద్దగా ఉద్యోగ అవకాశాలు రావని జగన్మోహన్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా చాలామంది ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలోకి పెట్టుబడులు తీసుకురావడం చేతకాదు కానీ మాటలు మాత్రం చెప్తారు అని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
Read also : మరోసారి తండ్రి కాబోతున్న రాంచరణ్.. వైరల్ అవుతున్న సీమంతం వేడుకలు
మరోవైపు సీఎం చంద్రబాబు ఎఫిషియన్సీలో వీక్.. క్రెడిట్ చోరీలో పీక్ అని ఎద్దేవా చేశారు. ఒకే ఒక బిల్డింగ్ కట్టి.. హైదరాబాద్ మొత్తం నేనే కట్టాను అని చెప్పుకుంటూ తెగ సంతోష పడిపోతున్నారని అన్నారు. ఆరే 6 ఎకరాలలో సైబర్ టవర్స్ కట్టి.. హైదరాబాద్ మొత్తం తాని కట్టినట్టుగా బాబు చాలా బిల్డప్ ఇస్తున్నారని జగన్ ఆరోపించారు. కెసిఆర్, వైయస్సార్ తెలంగాణకు గొప్ప పాలన అందించారు. కానీ క్రెడిట్ మొత్తం కూడా చంద్రబాబు తీసుకుంటున్నారు అని మండిపడ్డారు.
Read also : ఏపీలో కొత్త జిల్లాలకు రంగం సిద్ధం..!