
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు బాలకృష్ణపై తీవ్రంగా మండిపడ్డారు. గతంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తాజాగా స్పందిస్తూ అసెంబ్లీలో పని పాట లేని చర్చను బాలకృష్ణ తీసుకువచ్చారని ఫైరయ్యారు. ఆల్కహాల్ సేవించి అసెంబ్లీకి వచ్చారంటూ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. అసలు అసెంబ్లీకి తాగిన వ్యక్తిని ఎలా రాణిస్తారు?.. అని స్పీకర్ కు అసలు బుద్ధి లేదని మండిపడ్డారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ప్రశ్నించుకోవాలని తాజాగా మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also : మహిళల ప్రపంచ కప్ లో రికార్డులు సృష్టించిన మహిళలు.. ఓపినర్స్ ఇద్దరూ సెంచరీలే!
కాగా కొద్ది రోజుల కిందట జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చిరంజీవి మరియు ఇతర హీరోలను తాడేపల్లికి పిలిచి అవమానించారని బీజేపీ ఎమ్మెల్యే కామినేని అసెంబ్లీలో అన్నారు. జగన్ రాకుండా మంత్రులను పంపారని.. చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్మోహన్ రెడ్డి వచ్చారని కామినేని శ్రీనివాస్ మాట్లాడారు. అయితే కామినేని వ్యాఖ్యలపై బాలకృష్ణ తప్పుపడుతూ ఎవరూ కూడా గట్టిగా అడగలేదని.. జగన్ ఒక సైకో గాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు బాలకృష్ణ. ఈ విషయంపైనే తాజాగా ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ బాలకృష్ణపై ఫైరయ్యారు.
Read also : మరోసారి తండ్రి కాబోతున్న రాంచరణ్.. వైరల్ అవుతున్న సీమంతం వేడుకలు





