
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మత్స్యకారులు పొరపాటున బంగ్లాదేశ్ బోర్డర్ లోకి ప్రవేశించారు. ఈ విషయాన్ని స్వయంగా బంగ్లాదేశ్ నేవీ అధికారులు వెల్లడించారు. దీనిపై స్పందించిన మంత్రి అచ్చెన్నాయుడు బంగ్లాదేశ్ నేవీ అదుపులో ఉన్నటువంటి 8 మంది విజయనగరం జిల్లా మత్స్యకారులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇప్పటికే చర్యలు కూడా ప్రారంభించామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని… విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతామని తెలియజేశారు. మత్స్యకారుల కుటుంబాలు ఎట్టి పరిస్థితుల్లోనూ భయపడాల్సిన అవసరమే లేదని… మత్స్యకారులకు అండగా ఉంటామని మంత్రి భరోసా ఇవ్వడం జరిగింది. కాగా అనుకోకుండా విజయనగరం మత్స్యకారులు ఒక ఎనిమిది మంది బంగ్లాదేశ్ బోర్డర్ లోకి ప్రవేశించగా అక్కడ నేవీ వారిని అదుపులోకి తీసుకుంది. మరుపులి చిన్నప్పన్న, రాము, రమేష్, అప్పలకొండ, ప్రవీణ్, చిన్నప్పన్న, రమణ, మరో రాము వీరందరూ కూడా బంగ్లాదేశ్ నేవీ అదుపులో ఉన్నారు. ఈనెల 13వ తేదీన వేటకు వెళ్లిన వీరందరూ దారితప్పి 14న అర్ధరాత్రి రెండు గంటలకు బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించగా.. వారిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు స్పందిస్తూ కచ్చితంగా వారిని వెనక్కి తీసుకువచ్చే బాధ్యత మాది అని మత్స్యకారుల కుటుంబాలకు భరోసా ఇచ్చారు.
Read also : మంత్రుల గొడవతో వేగలేక.. వెళ్లిపోతున్న సీనియర్ IASలు!
Read also : ఏపీలో ఆకస్మిక వరదలకు అవకాశం.. రెడ్ అలర్ట్!