
క్రైమ్ మిర్రర్, వైరల్ న్యూస్ :- సోషల్ మీడియా వేదికగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై చాలానే ట్రోలింగ్ జరుగుతుంది. నిన్న విడుదల చేసిన ప్రతిష్టాత్మకమైన నోబెల్ శాంతి పురస్కారం ట్రంప్ కు రాని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే నోబెల్ శాంతి అవార్డు కోసం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ ఆ ప్రయత్నాలు ఏమీ కూడా వర్కౌట్ అవలేదు. దాదాపు 338 మంది ఈ నోబెల్ శాంతి బహుమతి కోసం నామినేట్ అయ్యారు. ఇందులో డోనాల్డ్ ట్రంప్ కూడా ఉన్నారు. కానీ చివరికి ఈ నోబెల్ శాంతి అవార్డు అనేది వెనుజులా కు చెందిన ప్రతిపక్ష నాయకురాలు, మానవ హక్కుల ఉద్యమకర్త మరియా కోరిన మచాడోకు లభించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పెద్ద నిరాశ ఎదురయింది. నిన్న నోబెల్ పురస్కార్ అవార్డు ప్రకటించే ముందు డోనాల్డ్ ట్రంప్ ఎన్నో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపం వ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో దేశాల మధ్య యుద్ధాలను శాంతియుతం చేసే వాతావరణాన్ని సృష్టించానని చాలా గొప్పగా చెప్పుకొచ్చారు. నోబెల్ శాంతి బహుమతిని అందుకోవడానికి నేను అర్హుడినని గర్వంగా చెప్పుకుంటున్నాను అన్నట్లుగా చెప్పుకొచ్చారు. కానీ చివరికి అవార్డు రాకపోవడంతో సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. భారత్ మరియు వివిధ దేశాలపై ట్రంప్ టారిఫ్ విధించిన నేపథ్యంలో చాలా మంది ట్రంప్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ నోబల్ పురస్కార్ రాకపోవడంతో వీరందరూ కూడా ట్రంప్ సోషల్ మీడియా వేదికగా కౌంటర్స్ వేస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ట్రంప్ కు ఈ నోబెల్ పురస్కారం రాకపోవడానికి చాలానే కారణాలు ఉన్నాయి. జనవరి 31వ తేదీ లోపే నోబెల్ అవార్డు నామినేషన్ల గడువు అయిపోగా ఆ తరువాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నామినేషన్ పత్రాలు నోబెల్ కమిటీకి అందాయి అని వాదనలు వినిపిస్తున్నాయి.
Read also : మా మధ్య రిలేషన్షిప్ ఇదే.. ఈ రంగుల ప్రపంచంలో ప్రతి దానిపై ఆసక్తి ఎక్కువ : పూరి జగన్నాథ్
Read also : తిరుమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్..!