
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఐపీఎల్ 2026 సంబంధించి మినీ వేలం ఈ నెల 16వ తేదీన అబుదాబిలో జరుగునన్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఈ మినీ వేలంలో భాగంగా తాజాగా ఐపీఎల్ నిర్వహకులు తొలి సెట్ లో ఉండేటువంటి ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు. ఈ తొలి సెట్ జాబితాలో మొత్తం 6 గురు ప్లేయర్లను ఉంచారు. ఇందు లో భారీ ధర పలికేటువంటి ఆటగాళ్లు ఉన్నారు. మరీ ముఖ్యంగా డివాన్ కాన్వే, డేవిడ్ మిల్లర్, సర్ఫరాజ్ ఖాన్, కెమెరాన్ గ్రీన్, పృద్వి షా, జాక్ ప్రెజర్ వంటి కీలక ఆటగాళ్లు ఉన్నారు. వీరందరిలో మినీ వేలంలో అత్యధిక ధర కేమెరన్ గ్రీన్ పలికే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇతను బ్యాటింగ్ మరియు బౌలింగ్ చేయగల ప్లేయర్ కాబట్టి ఎక్కువ ధర పలికే అవకాశాలు ఉన్నాయి అని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు ఈ మినీ వేలంలో దాదాపు చాలామంది పాల్గొంటున్నారు. ఇప్పటికే ఆయా ఫ్రాంచైజీలు ఏ క్రికెటర్ ను కొనుగోలు చేయాలి అని ఒక స్పష్టత అయితే వచ్చాయి. మరి ఈసారి అత్యధిక ధర పలికే ప్లేయర్ ఎవరో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : రికార్డ్ స్థాయిలో యాదాద్రి జిల్లాలో పోలింగ్..?
Read also : ప్రజల్లోకి వెళ్ళండి.. దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు మోడీ సూచన





