
Interesting Facts: లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకునే వారు సాయంత్రం వేళల్లో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య వాతావరణం పవిత్రంగా మారుతుందని, ఈ సమయం ఆధ్యాత్మికంగా శక్తివంతమైనదని పురాణాలు చెబుతున్నాయి. వాస్తు ప్రకారం.. ఈ సమయంలో తులసి మొక్కను తాకడం అశుభంగా భావించబడుతుంది. ఇది ఇంటికి ఆర్థిక ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉన్నట్లు పెద్దలు హెచ్చరిస్తారు.
అదే సమయంలో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించడానికి ఇంటి ప్రధాన ద్వారం సాయంత్రం 7 నుండి 9 గంటల వరకు తెరిచి ఉంచాలని ఆచారాలు చెబుతున్నాయి. ఇంటి పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే శుభ్రమైన, సువాసనలతో నిండిన, ప్రశాంతమైన ఇళ్లను లక్ష్మీదేవి ఇష్టపడుతారని పండితులు అంటారు. సాయంత్రం దీపం వెలిగించడం, శాంతిని నిలుపుకోవడం, ఇంటిని కలతల నుండి దూరంగా ఉంచడం సంపద ప్రవాహాన్ని పెంచుతుందని నమ్మకం.
NOTE: పైన తెలిపిన వార్తను కేవలం అవగాహన కోసం మాత్రమే ప్రచురించాము. క్రైమ్ మిర్రర్ దీనిని అధికారికంగా ధృవీకరించట్లేదు.
ALSO READ: వివాహేతర సంబంధం.. భర్తను గొడ్డలితో నరికి చంపి చెరువులో విసిరేసిన భార్య





