
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్ :- భారత్, పాకిస్తాన్ దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం ప్రకటించారు. ఈ మేరకు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వచ్చాయి. అమెరికా మధ్యవర్తిత్వం లో రాత్రంతా కొనసాగిన చర్చల అనంతరం ఈ ఒప్పందానికి వచ్చినట్టు ఆయన తెలిపారు. పూర్తిస్థాయిలో, తక్షణ కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. కామన్ సెన్స్ ఉపయోగించిన రెండు దేశాలకూ అభినందనలు.. అని ఆయన పేర్కొన్నారు. కాగా ట్రంప్ ట్వీట్‌ను భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ ధృవీకరించారు. అమెరికా మధ్యవర్తిత్వం వహించిన ఈ చర్చల్లో తాము కాల్పుల విరమణకు అంగీకరించామని ఆయన తెలిపారు.
సాయం చేసిన కృతజ్ఞత లేని టర్కీ.. పాకిస్తాన్ కు డ్రోన్లు సరఫరా