
India Reaction: అమెరికా పర్యటనలో ఉన్న పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్.. అణు బెదిరింపులకు దిగడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. అణ్వస్త్ర బెదిరింపులు పాకిస్థాన్ కు కొత్తేమీ కాదని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. తమ ఉనికికే ప్రమాదం ఏర్పడితే.. భారత్‌పై అణుదాడి చేస్తామంటూ పాక్ ఆర్మీ చీఫ్ అవాకులు చవాకులు పేలాడు. ఒకవేళ తాము మునిగిపోతే, సగం ప్రపంచాన్ని వెంట తీసుకెళ్తామంటూ తమ పైత్యాన్ని బయటపెట్టుకున్నాడు. ఈ వ్యాఖ్యలపై భారత్ సీరియస్ గా స్పందించింది.
అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు రావడం విచారకర
గతంలో ఎప్పుడూ లేని విధంగా మునీర్ అమెరికా గడ్డ మీది నుంచి ఈ వ్యాఖ్యలు చేయడం నిజంగా విచారకరమని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ’పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యల ద్వారా ఆ దేశంలో అణ్వస్త్రాల నియంత్రణ, కమాండ్ వ్యవస్థ నైతికతపై ఉన్న అనుమానాలు మరింత పెరుగుతున్నాయి. ఉగ్రవాద గ్రూపులతో పాక్ సైన్యం కలిపి పనిచేస్తోందన్న వాస్తవం మరోసారి వెల్లడి అవుతోంది. అణ్వస్త్ర బ్లాక్ మెయిల్ కి భారత్ తలొగ్గదు. అదే సమయంలో జాతీయ భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది’’ అని ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ వర్గాలు మునీర్ వ్యాఖ్యలు బాధ్యతారహితానికి నిదర్శనమని వెల్లడించినట్లు పీటీఐ వెల్లడించింది. పాక్ సైన్యానికి అమెరికా మద్దతిస్తే.. పాక్ తన అసలు స్వరూపాన్ని, చెత్త బుద్దిని బయటపెట్టుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
Read Also: జెలెన్ స్కీకి ప్రధాని మోడీ ఫోన్, కీలక అంశాలపై చర్చ!