
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీసులకు రక్షణ లేకుండా పోయిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా రౌడీ షీటర్ దాడిలో ప్రమోద్ అనే కానిస్టేబుల్ చనిపోయిన విషయం ప్రతి ఒకరి తెలిసిందే. ఒక రౌడీ చేతిలో కానిస్టేబుల్ చనిపోవడం చాలా దురదృష్టకరమని హరీష్ రావు అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని… వారి కుటుంబానికి అండగా నిలబడాలని కోరారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హోం మంత్రి స్థాయిలో ఉన్నారని… రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. అదే పాత రోజుల్లో అయితే ఇలాంటి దుర్ఘటనలు జరిగితే వెంటనే నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవారు అని… కానీ రేవంత్ రెడ్డికి అలాంటి నైతిక బాధ్యత లేదు అని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. కాగా కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేసినటువంటి రియాజ్ అనే నిందితుడు తాజాగా పోలీస్ లు జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనగా మారింది. నిందితుడికి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తుండగా.. కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కుని పరిగెత్తుతుండగా ఆత్మ రక్షణలో భాగంగా పోలీసులు అతనిపై కాల్పులు జరపగా అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఈ కేసు ఇంతటితో ముగిసిపోయింది.
Read also : కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ప్రకటించిన డీజీపీ
Read also : నూతన వరి నాటే మిషన్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్