-
ఖాజాగూడ లోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా భారీ కమర్షియల్ నిర్మాణం..! అధికారుల పాత్రపై అనుమానాలు..!
-
సర్వే నంబర్ 27/1లో ప్రైవేట్ నిర్మాణం.. అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు?
-
ప్రభుత్వ భూమిలో ఇంత ధైర్యంగా నిర్మాణం ఎలా సాధ్యం? అధికారుల తీరుపై విమర్శలు
-
అనుమతులు ఉన్నాయా..? అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదు?
-
నిర్మాణం వెనుక ‘మతలబు’ ఏమిటి?
-
పూర్తి సమాచారంతో రేపటి కథనంలో మీ ముందుకు రానుంది.!
క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడ గ్రామంలోని సర్వే నంబర్ 27/1లో జరుగుతున్న భారీ కమర్షియల్ నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ రికార్డులు, 22-A నిషేధిత ఆస్తుల జాబితాలో ఈ సర్వే నంబర్‌కు సంబంధించిన భూమి “స్టేడియం – స్టేట్ గవర్నమెంట్ ” గా నమోదై ఉన్నట్లు పత్రాల ద్వారా తెలుస్తోంది.
అయితే, ఇదే భూమిలో ఒక ప్రైవేట్ వ్యక్తి భారీ కమర్షియల్ నిర్మాణం చేపడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉన్న ప్రాంతంలో ఇంత పెద్ద నిర్మాణం జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అసలు ఈ నిర్మాణానికి అవసరమైన అనుమతులు ఉన్నాయా? ఉంటే ఎవరు మంజూరు చేశారు? రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారు? మున్సిపల్ / టౌన్ ప్లానింగ్ విభాగం నుంచి భవన నిర్మాణ అనుమతి పొందారా? సంబంధిత NOCలు ఉన్నాయా? అనే ప్రశ్నలకు అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది.
మరోవైపు, నిర్మాణం ఇంత బహిరంగంగా కొనసాగుతున్నా అధికారులు అడ్డుకోకపోవడంపై స్థానికుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యమా? లేక నిర్మాణదారుడికి ఎవరైనా అండగా నిలుస్తున్నారా? అనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇంత పెద్ద నిర్మాణం అధికారుల దృష్టికి రాకుండా ఎలా కొనసాగుతుందన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. అధికారులపై డబ్బుల కోసం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు, విమర్శలు స్థానికంగా వినిపిస్తున్నప్పటికీ, వాటిపై సంబంధిత అధికారులు స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో నమోదైన సర్వే నంబర్ 27/1లో జరుగుతున్న నిర్మాణంపై రెవెన్యూ, మున్సిపల్, టౌన్ ప్లానింగ్ అధికారులు సంయుక్తంగా విచారణ జరిపి, నిర్మాణానికి ఉన్న అనుమతులు, భూమి హక్కులు, NOCలు తదితర అంశాలను బహిర్గతం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ నిర్మాణానికి అనుమతి ఎవరిచ్చారు? నిర్మాణం వెనుక అధికారుల పాత్ర ఏమైనా ఉందా? అన్న ప్రశ్నలకు అధికారులు ఇచ్చే సమాధానంపైనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ప్రభుత్వ భూమిలో ప్రైవేట్ నిర్మాణానికి అనుమతి ఎవరిచ్చారు? నిర్మాణం వెనుక అధికారుల పాత్ర ఏమైనా ఉందా?
*నిఘా వ్యవస్థలు నిద్రిస్తే.. క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది!*
ఈ వ్యవహారానికి సంబంధించిన మరిన్ని కీలక వివరాలు, అందుబాటులో ఉన్న అధికారిక రికార్డులు, నిర్మాణానికి సంబంధించిన అనుమతులు, సంబంధిత అధికారుల పాత్రపై పూర్తి సమాచారంతో రేపటి కథనంలో మీ ముందుకు రానుంది. కొనసాగుతుంది… క్రైమ్ మిర్రర్.
