
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- బంగ్లాదేశ్ మరియు భారత్ దేశాల మధ్య గత కొంతకాలంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా చాలానే మార్పులు చోటు చేసుకుంటున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగినటువంటి దాడుల తరువాత బీసీసీఐ ఆ దేశ ప్లేయర్ ను ఐపీఎల్ నుంచి బ్యాన్ చేసిన విషయం తెలిసిందే. కొన్ని కారణాల ద్వారా బంగ్లాదేశ్ ముస్తఫిసర్ రెహమాన్ ను కోల్కత్తా జట్టు నుంచి తొలగించారు. ఇక ఆ తరువాత బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ఇండియాలో జరగబోయేటువంటి టి20 వరల్డ్ కప్ మ్యాచ్లను ఆడము అని.. మాకు ఇతర వేదికలలో మ్యాచులు కొనసాగించాలని కోరారు. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వినతిపై ఇవాళ ఐసీసీఐ ఓటింగ్ నిర్వహించగా 14-2 తో రిజెక్ట్ కావడం జరిగింది. దీంతో బంగ్లాదేశ్ జట్టు టి20 వరల్డ్ కప్ మ్యాచ్లు భారత్లోనే ఆడాల్సిందే అని తాజాగా ఐసీసీ తేల్చి చెప్పింది. ఇక రేపటిలోగా తమ నిర్ణయాన్ని చెప్పాలి అని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకి అల్టిమేట్ జారీ చేసింది. ఒకవేళ ఇప్పటికీ కూడా ఇండియాలో ఆడబోమని చెబితే ఆ జట్టు ప్లేస్ లో మరొక జట్టును రీప్లేస్ చేస్తాము అని ప్రకటించింది. దీన్నిబట్టి చూస్తే ఒకవేళ బంగ్లాదేశ్ జట్టు ఇండియాలో ఆడమని తేల్చి చెబితే ఆ తర్వాత క్వాలిఫైయర్స్ మ్యాచులు పాయింట్స్ ఆధారంగా స్కాట్లాండ్ కు చాన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి వీటిపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాల్సిందే.
Read also : Emotional Incident: ‘అమ్మా నాన్న.. ఐ లవ్ యూ.. నన్ను క్షమించండి’
Read also : Madaram: సమ్మక్క- సారలమ్మ గద్దెల వద్ద జాగ్రత్త.. తలలు పగులుతున్నాయి





