
క్రైమ్ మిర్రర్, జగిత్యాల:- ఆ డి డబ్ల్యు ఓ పై ఒకటి కాదు రెండు కాదు అనేక ఆరోపణలు ఉన్నాయి. పోస్టింగ్ మొదలుకొని అక్రమవసూళ్ల వరకు ఆ అధికారి మొత్తం అవినీతి బాటనే ఎంచుకున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి. జగిత్యాల జిల్లాలో తన తోటి ఉద్యోగులను టార్గెట్ గా చేసి నచ్చని వారిపై కావాలని ఫిర్యాదులు చేయించి తాను అధికారిననే పెత్తనంతో ఇష్టానురీతిన వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతను ఎవరో కాదు.. జగిత్యాల జిల్లా డీ డబ్ల్యూ ఓ బోనగిరి నరేష్.
Read also : సింధూ జలాల కోసం పాక్ రిక్వెస్ట్, ఎంబసీకి న్యూస్ పేపర్లు నిలిపేసిన భారత్!
స్త్రీ శిశు సంక్షేమ శాఖలో జోరుగా ప్రచారం జరుగుతోంది. తనను ఎవరూ ఎం చేయలేరని ఆ డి డబ్ల్యు ఓ బాహాటంగానే ప్రచారం చేసుకుంటున్న.. అధికారులు మాత్రం వేడుక చూస్తున్నారు తప్ప ఏమాత్రం చర్యలు తీసుకోవడం లేదని ఆ శాఖ జగిత్యాల జిల్లా ఉద్యోగుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కొన్ని చోట్ల అంగన్వాడీ టీచర్లు రిటైర్డ్ అవడంతో అంగన్వాడీ ఆయాలకు టీచర్ పోస్ట్ ఇవ్వడానికి లక్షల్లో డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. జగిత్యాల జిల్లా డి డబ్ల్యు ఓ అధికారి కి కుల అనే వివక్ష కూడా బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. తన దగ్గర పని చేసే వారిని తోటి ఉద్యోగులను ఎవరిది ఏ కులమో అని ఆరాతీసి మరి వేధింపులకు గురి చేస్తున్నట్లు తెలిసింది.
Read aslo : గాజాపై వ్యాఖ్యలు.. ప్రియాంక గాంధీపై ఇజ్రాయెల్ ఆగ్రహం!
ఈ వ్యవహారంలో పెగడపల్లి మండలం లోని బత్కేపల్లి గ్రామంలో ఆరవ అంగన్వాడి టీచర్ రు కోడిపెల్లి జమున విధుల నుంచి తొలగించడం జరిగిందని.. ఈ నెల 4గున టెర్మినేషన్ లెటర్ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్ జమునని జగిత్యాల జిల్లా డి డబ్ల్యూ ఓ బోనగిరి నరేష్ లక్ష రూపాయలు అడిగితే తను స్పందించలేదని కక్ష పెంచుకొని లేనిపోని ఆరోపణలతో తనకు ఎలాంటి నోటీసులు గానీ మెమో గాని ఇవ్వకుండా జమునను పూర్తిగా విధుల నుంచి తొలగించారు. తనను విధుల్లో లో నుండి ఎందుకు తొలగించారని అడిగితే నాకు అధికారం ఉంది నేను చేస్తానని ఏదైనా ఉంటే నాపై ఆఫీసర్లకి కంప్లైంట్ చేసుకోండి అని చెప్పారు. ఈ విషయంపై జమున కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది.
అసలు ఆ అధికారిణి కి ఎందుకింత ధీమా…?
డి.డబ్ల్యూ.ఓ గురించి క్రైమ్ మిర్రర్ లో మరిన్ని కథనాలు త్వరలో…