
తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి వీఆర్ఎస్ తీసుకోవడం దుమారం రేపుతోంది. మంత్రుల మధ్య గొడవలు, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు తట్టుకోలేకే సయ్యద్ రిజ్వి ఉద్యోగం వదిలేసి వెళ్లిపోయాడనే చర్చ సచివాలయంలో జోరుగా సాగుతోంది.సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య నలిగిపోయి వీఆర్ఎస్ తీసుకున్నాడని తెలుస్తోంది. తన అల్లుడి కోసం సీఎం రేవంత్ రెడ్డి.. కొడుకు కోసం మంత్రి జూపల్లి కృష్ణారావు గొడవ పడటంతో.. వాళ్లిద్దరి మధ్య సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి బలి అయ్యాడని చెబుతున్నారు. 10 సంవత్సరాల పదవీకాలం ఉండగానే ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి వీఆర్ఎస్ తీసుకొని వెళ్లిపోయాడని అంటున్నారు.
500 కోట్ల రూపాయల లిక్కర్ హోలోగ్రాం టెండర్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు పట్టుబట్టారని తెలుస్తోంది. లిక్కర్ బాటిల్స్ మీద 500 కోట్ల హోలోగ్రాం టెండర్ తన అల్లుడికి కావాలని సీఎం రేవంత్ రెడ్డి, తన కొడుకుకు కావాలని మంత్రి జూపల్లి గొడవ పడ్డారని సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కొట్లాటలో మనస్తాపం చెంది ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి వీఆర్ఎస్ తీసుకున్నాడని సమాచారం.
తన మాట వినకుండా రిజ్వికి వీఆర్ఎస్ ఎలా ఇస్తారు అంటూ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాడట మంత్రి జూపల్లి కృష్ణారావు. అయితే జూపల్లి మాటను పక్కనపెట్టి రిజ్వికి వీఆర్ఎస్ ఇచ్చింది రేవంత్ సర్కార్. సీనియర్ ఐఏఎస్ అధికారి సయ్యద్ రిజ్వి వీఆర్ఎస్ తీసుకోవడం తెలంగాణ సివిల్ సర్వెంట్లలో ప్రకంపనలు స్పష్టిస్తుందని తెలుస్తోంది.