
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ హోమ్ మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ స్పష్టమైన మెజార్టీ సాధిస్తుంది అని .. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు అని అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఈసారి 160 కి పైగా స్థానాలు విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి తో సహా ప్రతి ఒక్క కీలక నాయకుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పాల్గొని ప్రజలకు గెలిస్తే ఇచ్చిన హామీలను నెరవేరుస్తాము అని చెప్తున్నారు. ఈ ఎన్నికలలో బీజేపీ మరియు జేడీయు పార్టీలు సమాన సీట్లు సాధిస్తాయని వెల్లడించారు. ఎలక్షన్ల లో భాగంగా ఇప్పటికే బీహార్ రాష్ట్రానికి ఎన్నో రకాల పథకాలను కూడా ప్రారంభిస్తామని వివరిస్తూ ఉన్నారు. గత 11 ఏళ్లలో రోడ్లు మొదలుకొని బ్రిడ్జిలు అలాగే పవర్ ప్లాంట్ లు వంటి అతి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను బలోపేతం చేసాము అని అన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు మరియు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కూడా కల్పిస్తామని హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ కూడా ప్రధాని మోడీ పాలనను ప్రశంసిస్తున్నారు అని .. కచ్చితంగా ఈ ఎలక్షన్లలో విజయం మాదే అని మరోసారి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఈ మధ్య మోడీ కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా బీహార్ లో మావోయిజం అంతం చేస్తానని వెల్లడించారు.
Read also : ఉమెన్స్ వరల్డ్ కప్ చూడడానికి కారణం ఇదే.. జగన్ కు కౌంటర్ ఇచ్చిన లోకేష్
Read also : USA లో కుప్ప కూలిన కార్గో విమానం.. ఘోరంగా ఎగిసిపడ్డ మంటలు!





