తెలంగాణ

నేటి నుంచి దర్గా ఉర్సు ఉత్సవాలు ప్రారంభం

క్రైమ్ మిర్రర్, పాలకీడు:- మండల పరిధిలోని జానపహాడ్ దర్గాలో ఉర్సు ఉత్సవాలు నేటి నుంచి మూడు రోజులపాటు అట్టహాసంగా జరగనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజు తెల్లవారుజామున గుసూల్ షరీఫ్ కార్యక్రమం తో వేడుకలు మొదలవుతాయి. ఈ సందర్భంగా సైదులు బాబా సమాధులపై ఉన్న చాదర్లు, దట్టీలు తీసి సమాధులను పవిత్ర జలంతో శుభ్రపరుస్తారు. అనంతరం దీపారాధన చేసి వేడుకలను ప్రారంభిస్తారు.తెలుగు వారే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్తులు తరలి రానున్నారు. నమ్మిన భక్తుల కోర్కెలు తీర్చే దైవంగా, మత సామరస్యానికి ప్రతీకగా ఉత్సవాలకు ఘనమైన చరిత్ర ఉంది. భక్తులు తమ కోర్కెలు తీరితే కందూరు. పేరిట మొక్కులు చెల్లించుకుంటారు. సంతానం లేని వారు సంతానం కలిగితే సైదులు బాబా పేరును పుట్టిన బిడ్డలకు నామకరణం చేస్తుంటారు. ఈ ఉర్సు ఉత్సవాలను వక్సబోర్డ్ఆధ్వర్యంలో, ప్రభుత్వం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు.

జానపహాడ్ దర్గా చరిత్ర.. సుమారు 400 ఏండ్ల పైబడి మద్రాసు రాష్ట్రంలోని నాగూర్ గ్రామంలో వెలిసిన నాగూర్ షరీఫ్, ఖాదర్ దర్గా విశిష్టతను తెలుగు రాష్ట్రంలో కూడా ప్రచారం చేయాలని తలచి, జానపహాడ్ సైరా, బాజీసైడా, మొహినుద్దీన్ అనే భక్తులు బయలుదేరారనే కథ ప్రచారంలో ఉంది. ఈముగ్గురు భక్తులు తెలుగు రాష్ట్రాలకు చేరి నాగూర్ షరీఫ్ గొప్పతనాన్ని చాటుతూ ఊరూరా తిరగసాగారు. మత ప్రచారంలో తమ వ్యతిరేకులతో పోరాడి వారు అమరులయ్యారు వాడపల్లి వద్ద అమరుడైన జానపహాడ్ సైదా జ్ఞాపకార్ధం వజీరాబాద్ రాజకుమారుడు జాన్పహాడ్ వద్ద పవిత్ర సమాదులు కట్టించారని చెప్పుకుంటారు. ఆతర్వాత జాస్పడు సైదా నిర్మించాడని దీని మూలంగానే జాన్పహాడ్ దర్గా పేరు వాడుకలోకి వచ్చింది. ఈప్రాంతమంతా నీటి వసతి లేదని తర్జన బర్జన పడుతున్న సమయంలో వేముల శేషారెడ్డి కలలో జాన్పహడ్ సైదా కనిపించి గుర్రం డెక్కలు ఉన్నచోట బావిని తవ్పించమని చెప్పాడట. దీంతో అక్కడ నీరు కనిపించిందని పెద్దలు చెబుతుంటారు.

నాగుల పుట్ట.. దీపం విశిష్టత

ఆనాడు దట్టమైన అరణ్య ప్రాంతంలో వచ్చే భక్తులకు అండగా ఉండేందుకు నాగుపాము ఉండేదని రాత్రిపూట సైదుల బాబా సమాధి పై పడుకునేదని కథ ప్రచారంలోఉంది. హిందువుల ఆరాధ్య దైవమైన నాగేంద్రుని ముస్లింలు కూడా పూజించడం విశేషం. అలాగే దర్గాలో సమాదులు వెలిసిన నాటి నుండి ఈదీపం నిత్యం వెలుగుతూనే ఉంది. భక్తులు దీపారాధన నూనెను ఎంతో పవిత్రంగా భావించి నొప్పులు ఉన్న చోట రాసుకుంటే తగ్గుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. ఈదీపంలో ప్రతీ శుక్రవారం రోజు వచ్చే భక్తులు నెయ్యి నూనెను దీపంలో పోస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు సమాది చుట్టూ ఉన్న గ్రిల్స్కు తాళాలు వేస్తారు. తమ కోర్కెలు తీరిన వెంటనే వచ్చి ఇక్కడ కందూరు చేసుకుని తాలాలు తీయడం అనాదిగా వస్తున్న ఆచారం.

గొల్లబామ గుట్ట., జాన్పహడ్ షహీద్ బాబాకు వజీరాబాద్ రాజుకు జరిగిన యుద్ద సమయంలో ఒక గొల్లభామ రావిపహాడ్ గ్రామం నుండి వజీరా బాద్ వెలుతూ అటుగా వచ్చింది. ఆ యుద్ద దృశ్యాన్ని చూస్తూ వెళ్తూ ఆమెకు జాన్పహాడ్ సైదులు బాబా ఒక హెచ్చరిక చేశారు. అమ్మాయి చూసినంత చూశావు ఇక నీవు వెనకకు చూడకుండా వెళ్ళిపో.. ఒక వేళ నువ్వు వెనకకు చూశావో అక్కడే శిల అయిపోతావు అని సైదులు బాబా హెచ్చరించాడు. అది విన్న గొల్లభామ ముందుకు సాగిపోతూ కొంత దూరం వెళ్ళాక యుద్ధం ఎలా జరుగుతుందో చూడాలనుకుంది. అత్యతను అదుపు చేసుకోలేక వెనకకు తిరిగి చూసింది. అంతే ఆమె శిలగా మారిపోయిందని పెద్దలు చెబుతుంటారు. గొల్లబామ శిల అయిన ప్రాంతాన్ని భక్తులు గొల్లభామ గుట్టగా భావించి నమస్కరిస్తారు. వచ్చిన భక్తులు తలా ఒక రాయిని ఆమెకు సమర్పించి స్మరిస్తుంటారు.

కందూరు…జాన్పహాడ్ దర్గా వర్షకు ప్రతీ శుక్రవారం దర్శనానికి వచ్చే వారు, ఉర్సుకు వచ్చే వారు అక్కడ తీర్చుకునే మొక్కులను కుండూరు అంటారు. కందూరు మొక్కులో మేకపోతు, గొర్రె పొట్టేలును నివేదనగా ఇవ్వడం ఆచారంగా వస్తోంది. భక్తులు తమ మొక్కు ప్రకారం మేక, పొట్టేలును తీసుకొచ్చి వాటికి స్నానం చేయించిన అనంతరం అలాల్ చేయిస్తారు. సఫాయి బావి నీటితో వండి దర్గాలో నివేదన(ఫాయితాలు) ఇచ్చి దర్శనంతో పాటు మొక్కు చెల్లించుకుంటారు” ఆ తర్వాత బందు మిత్రులకు భోజనాలు పెడతారు. పంచపహాడ్లు జాన్ప్పడ్ కేంద్రంగా మరో నాలుగు పహాడ్లు ఉన్నాయి. ఇవి జాన్ప్పడ్, గుండ్లపహార్. శూన్యపహాడ్, గణేష్సహాడ్, రావిపహాడ్లు. ఇవి పంచభూతాలకు సంకేతాలా లేక భారతీయ ధర్మంలోని పంచాయతన దేవారాధనకు సంకేతాలా అనే చర్చ కొనసాగుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button