తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న కొడంగల్ ఫార్మా రగడ ఇష్యూలో మరో కీలక పరిణామం జరిగింది. కొడంగల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన హౌస్‌మోషన్ పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది. లగచర్ల దాడి కేసులో ఏ1 నిందితుడిగా అభియోగాలు ఎదుర్కోంటూ.. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. అయితే పట్నం నరేందర్‌రెడ్డిని ప్రత్యేక బ్యారక్ లో ఉంచాలంటూ హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నేడు కోర్టుకు సెలవు కావడంతో నరేందర్ రెడ్డి తరపు న్యాయవాది హౌజ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సాధారణ నేరస్తులు మరో ఐదుగురితో కలిపి పట్నం నరేందర్ రెడ్డిని జైలులో ఉంచారని పిటిషన్ లో పేర్కొన్నారు. మాజీ ఎంఎల్ఏగా ప్రత్యేక బ్యారక్ లో పట్నం నరేందర్ ను ఉంచాలని న్యాయవాది తన పిటిషన్ లో కోరారు. పిటిషన్ ను పరిశీలించిన హైకోర్టు దాన్ని తిరస్కరించింది.
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటనలో దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఈ ఘటనకు సంబంధించి మరో పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దాడి జరిగినప్పటి సీసీ కెమేరాల ఆధారంగా వారిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. వారిని రహస్య ప్రదేశంలో ఉంచి పోలీసులు విచారిస్తున్నాట్లు సమాచారం. కాగా వారి చెప్పే వివరాల ఆధారంగా మరికొంత మందిని అరెస్ట్ చేసే అవకాశం వుంది. ఇలా కోసం ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సురేష్ కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది.
మరోవైపు సంగారెడ్డి సెంట్రల్ జైలుకు వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచెర్లలో కలెక్టర్‌పై దాడి ఘటన కేసులో జైలుకు వెళ్లిన 16 మంది రైతులను కేటీఆర్ పరామర్శించారు.లగచెర్లలో అసలు ఏం జరిగిందో తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని.. బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందనే భరోసా ఇచ్చారు. కేటీఆర్ తో పాటు ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, అనిల్ జాదవ్ లు కేటీఆర్ తో కలిసి సంగారెడ్డి జైలుకు వెళ్లారు. కేటీఆర్ రావడంతో సంగారెడ్డి జైలు దగ్గరకు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.
మరిన్ని వార్తలు చదవండి ..
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?