మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు కీలకంగా మారిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు అత్యంత కీలకం కావడంతో తెలంగాణ ముఖ్యనేతలంతా మహారాష్ట్రలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. గల్లీగల్లీ తిరుగుతూ కాంగ్రెస్ కూటమిని గెలిపించాలని కోరారు. కోమటిరెడ్డి ప్రచారానికి తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ కూటమి బంపర్ మెజార్టీతో గెలిచి అధికారం చేపట్టబోతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, షోలాపూర్ పార్లమెంట్ సభ్యురాలు ప్రణితి షిండేతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.కాంగ్రెస్ పార్టీ పట్ల మహా ప్రజల్లో ఆదరణ బాగుందని.. ఎక్కడికెళ్లినా కాంగ్రెస్సే కావాలని ప్రజలు ఎదురేగి స్వాగతం పలుకుతున్నారని తెలిపారు.శుక్రవారం మొదటి దఫా ప్రచారం పూర్తి చేసుకున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి సుషీల్ కుమార్ షిండేతో సమావేశమయ్యారు. రెండు రోజులుగా మహారాష్ట్రలోని షోలాపూర్ నియోజకవర్గంతో పాటు వివిధ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తున్న మంత్రి.. తన ప్రచార అనుభవాలను సుషీల్ కుమార్ షిండేతో పంచుకున్నారు. ప్రచారం సరళి, ప్రజల నుంచి కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ గురించి వివరించారు.
తెలంగాణకు చెందిన అనేక జిల్లాల నుంచి వచ్చిన చేనేత, యాదవ, కురుమ సోదరులు కాలనీలను ఏర్పాటు చేసుకున్నారని.. అక్కడికి వెళ్లగానే వారు అపూర్వ స్వాగతం పలికిన తీరు సంతోషం కలిగించిందని ఈ సందర్భంగా షిండేకు కోమటిరెడ్డి వివరించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మహారాష్ట్రలోనూ అమలు కావాలని ఇక్కడి ప్రజలు బలంగా కోరుకుంటున్నట్లు మంత్రి సుషీల్ కుమార్ షిండే దృష్టికి తీసుకువచ్చారు. కాంగ్రెస్ పార్టీ సంక్షేమానికి పట్టంకట్టే పార్టీ అని.. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకులేేనని ప్రజలకు వివరించినట్టు ఆయన చెప్పారు. ప్రచారంలో ప్రజల స్పందన చూస్తుంటే కాంగ్రెస్ కూటమి బంపర్ మెజార్టీతో గెలవబోతుందనేది స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు.
తెలంగాణకు షోలాపూర్ కు విడదీయలేని బంధం ఉందని, అత్యధిక జనాభా తెలంగాణ ప్రాంతానికి చెందినవారేనని సుషీల్ కుమార్ షిండే ఈ సందర్భంగా చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధిస్తుందని ఆయన ధీమావ్యక్తం చేశారు. ప్రచారంలో ఏ ప్రాంతాన్ని వదిలిపెట్టకుండా ప్రచారం నిర్వహిస్తూ పార్టీ గెలుపు కోసం శ్రమిస్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఈ సందర్భంగా సుషిల్ కుమార్ షిండే అభినందించారు.
మరిన్ని వార్తలు చదవండి ..
నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్
మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!
కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్
కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్
ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన
తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు
ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.
కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్
సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు
ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!
రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు
రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్
త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!
ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!
రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?