
మహేశ్వరం, క్రైమ్ మిర్రర్:- మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ, సత్యనారాయణ గార్డెన్ లో అయ్యప్ప స్వామి శరణు గోషలతో మారుమ్రోగాయి. శ్రీనివాస్ గౌడ్, ప్రభాకర్ గౌడ్,శంకరయ్య అధ్వర్యంలో నిర్వహించిన పుంజాల హేమంత్ గౌడ్ గురుస్వామి 18 వ.మెట్టు మహా పడిపూజ అంగరంగ వైభవంగా నిర్వహించారు. పూజను తిలకించడానికి రెండు కళ్ళు చాలవన్నట్టుగా కన్నుల పండుగగా జరిగింది. పూజ కార్యక్రమంలో అయ్యప్ప స్వామికి అభిషేకం, బగ్గిపై ఆభరణాల ఊరేగింపు,ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పదునెట్టంబడి పడిపూజలో కొబ్బరి చెట్టుకు పూజలు నిర్వహించి అనంతరం స్వామివారి పదునెట్టంబడి పడిని గురుస్వాముల అధ్వర్యంలో హేమంత్ గురుస్వామి కుటుంబ సభ్యుల చేత పడి వెలిగించారు. రెయిన్ బజారుకు చెందిన వేణుగోపాల్ భజన మండలి ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు,అన్నవితరణ గణించారు. ఈ కార్యక్రమంలో తుక్కుగూడ సన్నిధానం స్వాములు, గురుస్వాముల తో పాటు వివిధ గ్రామాలకు చెందిన అయ్యప్ప స్వాములు అధికసంఖ్యలో పాల్గొన్నారు.
Read also : రావిర్యాల పెద్ద చెరువులో ప్రోటోకాల్ వివాదం..?
Read also : తెలంగాణాలో ఉపసర్పంచ్ లకు చెక్ పవర్ రద్దు





