HomeUncategorizedవాహ‌న‌దారులచే హెల్మెట్‌ధార‌ణ ప్ర‌మాణం

వాహ‌న‌దారులచే హెల్మెట్‌ధార‌ణ ప్ర‌మాణం

రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న‌

ఒంగోలు, క్రైమ్‌ మిర్ర‌ర్ః

ద్విచ‌క్ర వాహ‌న‌దారుల‌కు పోలీసులు వినూత్నంగా రోడ్డు భ‌ద్ర‌త‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు. టంగుటూరు టోల్ ప్లాజా వ‌ద్ద పోలీసులు వాహ‌న త‌న‌ఖీలు నిర్వ‌హించారు.

కొంద‌రు వాహ‌న‌దారులు హెల్మెట్ లేకుండా వెళ్తున్న ద్విచ‌క్ర‌వాహ‌న‌దారుల‌ను ఆపి వారికి రోడ్డుభ‌ద్ర‌త నియ‌మాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.

హెల్మెట్ ప్రాణ రక్షక కవచంలా పనిచేస్తుందని పోలీసులు వివరించారు. అనంతరం వాహనదారులందరిచే “నేటి నుండి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరిస్తాం” అని ప్రతిజ్ఞ చేయించారు.

ఈ కార్యక్రమంలో సింగరాయకొండ సీఐ మాట్లాడుతూ కుటుంబ సభ్యుల క్షేమం కోసమైనా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు.

Most Popular

Recent Comments