
క్రైమ్ మిర్రర్, అమరావతి బ్యూరో:-
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్నటి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇప్పటివరకు కురుస్తూనే ఉన్నాయి. మరీ ముఖ్యంగా దక్షిణ కోస్తా, రాయలసీమలో రెండు రోజుల నుంచి భారీ వర్షాలు దంచి కొడుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో హోం మంత్రి అనిత ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై ఆరాధిస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సహాయక బృందాలను సిద్ధంగా ఉంచామని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని NDRF బృందాలకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేశామని వెల్లడించారు. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, కడప మరియు తిరుపతి జిల్లాలలో NDRF & SDRF బృందాలను అందుబాటులోకి తీసుకువచ్చామని స్పష్టం చేశారు. ప్రతి జిల్లాలోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి.. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై పర్యవేక్షిస్తున్నట్లుగా మంత్రి వివరించారు. ఎవరికైనా సరే.. ఎటువంటి సహాయం కావాలన్నా వెంటనే కంట్రోల్ రూమ్ నెంబర్స్ కు కాల్ చేయాలని కోరారు. ప్రజల కోసం ప్రభుత్వ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధంగా ఉంచామని తెలిపారు. ప్రతి జిల్లాల్లో కలెక్టర్ ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితులపై ఆరాతీస్తూ ఉండాలని సూచించారు. మరో రెండు రోజుల్లో మరో అల్పపీడనం రానుందని.. కావున ఈ నెల చివరి రోజు వరకు వర్షాలు పడుతూనే ఉంటాయని.. ఆ తరువాత వర్షాలకు ముఖం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి అప్పటివరకు ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలని… అత్యవసర పరిస్థితులు ఏర్పడితేనే బయటకు వెళ్లాలని కోరారు. కరెంట్ స్తంభాలు, ఉరుములు నేపథ్యంలో చెట్ల క్రింద ఉండకూడదని హెచ్చరించారు.
Read also : మత్స్యకారులను వెనక్కి తీసుకువచ్చే బాధ్యత మాది : మంత్రి అచ్చెన్నాయుడు
Read also : మంత్రుల గొడవతో వేగలేక.. వెళ్లిపోతున్న సీనియర్ IASలు!