
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్ :- తమన్ మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తప్ప ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మాత్రమే తెలుసు. కానీ తమన్ క్రికెట్ ఎంత బాగా ఆడతారో కేవలం మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే తెలుసు. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ లోనే కాకుండా క్రికెట్ లోనూ అదరగొట్టారు. నిన్న హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియంలో జరిగినటువంటి ఎలైట్ క్రికెట్ లీగ్ మ్యాచ్ లో కేవలం 39 బంతుల్లోనే ఏకంగా సెంచరీ బాధారు. ఇది చూసిన సహజ నటులతో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. తమన్ చూడడానికి చాలా లావుగా కనిపిస్తుంటాడు. కానీ అతను బ్యాటింగ్ చూస్తే మాత్రం అవేవీ గుర్తుకు రావడంలేదు అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ నమోదు చేసిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయగా అది క్షణాల్లోనే వైరల్ అయ్యింది. ఒక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తుండగా… ఇందులో తమను అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అంతేకాకుండా ఈ టోర్నీ ద్వారా వచ్చినటువంటి మొత్తం డబ్బులను ఆపరేషన్ సిందూర్ జవాన్లకు అందిస్తానని తమన్ చెప్పినట్లుగా సమాచారం అందింది. దీంతో తమన్ మంచి మనసు మరోసారి స్పష్టంగా బయటకు కనిపిస్తుంది. కాగా ఒకవైపు మ్యూజిక్ డైరెక్టర్గా సినిమా ఇండస్ట్రీలో అదరగొడుతూనే మరోవైపు ఎంటర్టైన్మెంట్ గా క్రికెట్లో కూడా ఆధారపడుతున్నారు. దీంతో తమన్ తెలుగు రాష్ట్రాల్లో డ్యూయల్ రోల్ కనబరుస్తున్నారు అంటూ నెటిజనులు మెచ్చుకుంటున్నారు.
Read also : WWC లో మహిళల మొదటి ఓటమి… అనూహ్యంగా మలుపు తిరిగిందిగా!
Read also : SSMB 29 టైటిల్ పేరు “వారణాసి”… పస లేదంటున్న అభిమానులు!