
క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమాజిగూడ రోడ్ షోలో పాల్గొన్న కేటీఆర్ రేవంత్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసలు రేవంత్ రెడ్డి నడుపుతోంది సర్కారా?.. లేక దర్బారా?.. ఏం అర్థం కావట్లేదు అని కేటీఆర్ విమర్శించారు. ఇక హైడ్రా పేరుతో సామాన్య ప్రజల ఇళ్లను కూల్చి వేస్తూ రాష్ట్రాన్ని చివరి స్థానంలో నిలబెట్టారు అని తీవ్రంగా మండిపడ్డారు. ఇక్కడ జూబ్లీహిల్స్ ఊప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ పక్కాగా గెలుపొందుతుంది అని.. కాకపోతే మెజార్టీ ఎంతో తేలియాల్సి ఉంది అని.. కేటీఆర్ తమ పార్టీ గెలుపు పై ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రజల్ని ఎంతలా బతిమిలాడుకున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు అని ఎద్దేవా చేశారు. ప్రజలు మిమ్మల్ని నమ్మి ఒక అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని మొత్తం కూడా దివాలా తీయించారు అని కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్రంగా మండిపడ్డారు. ప్రజలు కూడా జూబ్లీహిల్స్ లో BRS ని గెలిపించి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి అని కోరారు. కాగా ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠంగా మారాయి. అన్ని పార్టీలు కూడా మేమంటే.. మేమే గెలుస్తాము అంటూ ధీమా వ్యక్తం చేయడంతో ఒకవైపు ప్రజలకు మరోవైపు నాయకులు కూడా ఈ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు?.. అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొన్ని సర్వేలు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అని, మరికొన్ని సర్వేలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని చెప్పుకొచ్చాయి.
Read also : త్వరలోనే ఫుట్ బాల్ కు వీడ్కోలు పలకనున్న రోనాల్డో?
Read also : కార్తీక పౌర్ణమి ఎఫెక్ట్… భక్తులతో, దీపాలతో వెలిగిపోతున్న దేవాలయాలు!





