
క్రైమ్ మిర్రర్, మహాదేవ్ పూర్ ప్రతినిధి:- పొగాకు, ధూమపానం అలవాట్ల వల్ల విద్యార్ధులు, యువత నిర్వీర్యం అవుతోందనీ, సినిమా మాథ్యమం ద్వారా..వారిని చైతన్య పరిచేలా ఓ సినిమా తీయాల్సింది గా..పొగాకు నియంత్రణ అంతర్జాతీయ అవార్డు గ్రహీత,పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్ మెంట్ డిటి మాచన రఘునందన్ చేసిన ప్రార్ధన కు సినీ దర్శకుడు హరీష్ శంకర్ స్పందించారు.ఎక్స్(ట్విట్టర్)వేదిక గా హరీష్ శంకర్ కు “మాచన”జన్మ దిన శుభాకాంక్షలు తెలిపారు,ఇదే సందర్భంగా..పొగాకు, ధూమపానం దురలవాట్ల వల్ల సినిమా తీస్తే యువత జాగృతం అయ్యే అవకాశం ఉందని చేసిన రఘునందన్ విజ్ఞప్తి కి హరీష్ శంకర్ స్పందిస్తూ..”తప్పకుండా నా వంతు ప్రయత్నం నేను చేస్తా” అని రఘునందన్ ట్వీట్ పట్ల సానుకూలం గా స్పందించారు.
ఎక్కడున్నారు సార్.. వెయిటింగ్ ఇక్కడ – జగన్ జిల్లాల పర్యటనపై కేడర్ ఎదురుచూపులు
తిట్టుకున్నా, కొట్టుకున్నా విడాకులు లేవు – జనసేనతో దోస్తీపై లోకేష్ క్లారిటీ..!
మానుకోట జిల్లాల్లో గొడ్డలి దాడి.. దారుణ హత్యకు గురైన ఉద్యోగి