Homeతెలంగాణహనుమాన్ మండల దీక్షలు ప్రారంభం

హనుమాన్ మండల దీక్షలు ప్రారంభం

క్రైమ్ మిర్రర్,మహాదేవపూర్ ప్రతినిధి:-
జిల్లాలోని పలు హనుమాన్ దేవాలయాల్లో భక్తులు 41 రోజుల పాటు కఠినమైన నియమాలతో మండల దీక్షలను (హనుమాన్ మాలధారణ) అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రారంభించారు. ఇదే క్రమంలో మహాదేవపూర్ మండలంలోని సూరారం శివకేశాల హనుమాన్ దేవాలయంలో అర్చకులు వంగల సత్యనారాయణ చారి ఆధ్వర్యంలో హనుమాన్ మండల దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్బంగా అర్చకులు వంగల సత్యనారాయణ చారి మాట్లాడుతూ దీక్షా కాలంలో ఇంద్రియ నిగ్రహం, మానసిక ఉల్లాసం, ఆధ్యాత్మిక బలం కలుగుతుందని, హనుమంతుని అనుగ్రహంతో కష్టాలు తీరుతాయని అన్నారు. జై హనుమాన్ నినాదాలతో ఆలయం మారుమ్రోగింది ఈ కార్యక్రమంలో హనుమాన్ దీక్షా పరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పై కేటీఆర్ స్పెషల్ ట్వీట్?

ఢిల్లీలో హై అలెర్ట్.. ఉగ్రవాద ముప్పు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments