
❂జీఎస్టీపై ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్టీఏ ప్రభుత్వం సంచలన నిర్ణయం
❂ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీద ప్రధాని మోడీ ఇచ్చిన హామీ మేరకు కీలక నిర్ణయం
❂పేదలు, మధ్యతరగతికి ఊరటనిచ్చేలా పన్ను శ్లాబుల కుదింపునకు జీఎస్టీ కౌన్సిల్ గ్రీన్ సిగ్నల్
❂ప్రస్తుతం 5, 12, 18, 28 శాతంగా ఉండగా ఇకపై 5శాతం, 18శాతం పన్నురేట్లు ఉంటాయి.
❂హానికర, విలాస వస్తువులపై 40 శాతం ప్రత్యేక పన్ను విధిస్తారు.
❂ఆరోగ్య, జీవిత బీమాలపై జీఎస్టీ పూర్తిగా రద్దు
❂దుర్గా నవరాత్రుల మొదటి రోజు అయిన సెప్టెంబర్ 22 నుంచి కొత్త జీఎస్టీ అమలు
GST Council New Tax Slabs: సామాన్య, మధ్యతరగతి ప్రజలపై ధరల భారం దించుతూ జీఎస్టీ కౌన్సిల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించిన దీపావళి కానుకను అనౌన్స్ చేసింది. ప్రస్తుతం నాలుగు జిఎస్టీ స్లాబ్స్ ఉండగా, ఇప్పుడు వాటిని రెండింటికి కుదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన భేటీ అయిన జీఎస్‌టీ కౌన్సిల్ ఈ నిర్ణయం తీసుకుంది. దేవీ నవరాత్రి వేడుక మొదలయ్యే సెప్టెంబర్ 22న కొత్త జీఎస్టీ అమలుకానుంది. సామాన్యులు రోజువారీ వినియోగించే అధిక శాతం వస్తువులపై పన్ను రేట్లు గణనీయంగా తగ్గనున్నాయి.
⦿ రోజువారీ నిత్యావసరాలపై
☀హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్ లు, షేవింగ్ క్రీమ్ 18% -5%
☀వెన్న, నెయ్యి, చీజ్ & పాల స్ప్రెడ్‌లు 12%-5%
☀ప్రీ-ప్యాకేజ్డ్ నామ్‌కీన్‌లు, భుజియా & మిశ్రమాలు 12%- 5%
☀వంట పాత్రలు 12% -5%
☀ఫీడింగ్ బాటిళ్లు, శిశువులకు నేప్‌కిన్‌లు & క్లినికల్ డైపర్లు 12%- 5%
☀కుట్టు మిషన్లు & స్పేర్ పార్ట్స్ 12%-5%
⦿ రైతులు, వ్యవసాయ సంబంధ వస్తువులు
☀ట్రాక్టర్ టైర్లు & స్పేర్ పార్ట్స్ 18%- 5%
☀ట్రాక్టర్లు 12% -5%
☀బయో-పురుగుమందులు, మైక్రో-పోషకాలు 12%-5%
☀డ్రిప్ ఇరిగేషన్ & స్ప్రింక్లర్లు 12% -5%
☀వ్యవసాయ, ఉద్యాన వస్తువుల(కల్టివేటర్లు, రోటవేటర్లు, వరికోత మిషన్లు, గడ్డి కట్టలు కట్టే మిషన్లు సహా ఇతర పరికరాలు) 12%- 5%
⦿ హెల్త్ కేర్ రంగం
☀హెల్త్ & లైఫ్ ఇనసూరెన్స్ 18% – 0%
☀థర్మామీటర్లు 18%- 5%
☀మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్ 12%- 5%
☀అన్ని డయాగ్నస్టిక్ కిట్లు 12%- 5%
☀గ్లూకోమీటర్ & టెస్ట్ స్ట్రిప్స్ 12%- 5%
☀కళ్ళజోళ్లు 12%- 5%
⦿ విద్య సంబంధ వస్తులు
☀మ్యాప్‌లు, చార్ట్ లు & గ్లోబ్ లు 12%- 0%
☀పెన్సిల్స్, షార్పెనర్లు, క్రేయాన్లు 12%- 0%
☀ఎక్సర్ సైజ్ పుస్తకాలు, నోట్ బుక్ లు 12%- 0%
☀ఎరేజర్లు 5%- 0%
⦿ ఆటోమొబైల్స్ రంగం
☀ పెట్రోల్ & పెట్రోల్ హైబ్రిడ్ కార్లు LPG, CNG కార్లు (1200 cc & 4000mm మించకూడదు) 28%- 18%
☀డీజిల్ & డీజిల్ హైబ్రిడ్ కార్లు (1500 cc & 4000mm మించకూడదు) 28%- 18%
☀త్రీ వీలర్ వాహనాలు 28%- 18%
☀మోటార్ సైకిల్స్ (350 cc & అంతకంటే తక్కువ) 28%- 18%
☀రవాణా వాహనాలు- 28%- 18%
⦿ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు
☀ఎయిర్ కండిషనర్లు 28%- 18%
☀టెలివిజన్ (32″ కంటే ఎక్కువ)(LED & LCD టీవీలతో సహా) 28%- 18%
☀మానిటర్లు & ప్రొజెక్టర్లు 28%- 18%
☀డిష్ వాషింగ్ మెషీన్లు 28%- 18%
పౌరుల జీవనం మెరుగుపడుతుంది- ప్రధాని మోడీ
జీఎస్టీ తగ్గింపుపై ప్రధాని మోడీ సంతోషం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పన్ను తగ్గింపులు, జీఎస్‌టీ సంస్కరణలు సామాన్యులకు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, మహిళలు, యువతకు ప్రయోజనం కలిగిస్తాయన్నారు. ఈ విస్తృత స్థాయి సంస్కరణలు పౌరుల జీవనాన్ని మెరుగుపరుస్తాయన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ప్రధాని పోస్టు పెట్టారు.