Homeతెలంగాణకాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తి...! ప‌ద‌వుల కోసం ఎదురు చూపులు...

కాంగ్రెస్‌లో పెరుగుతున్న అసంతృప్తి…! ప‌ద‌వుల కోసం ఎదురు చూపులు…

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ లో రోజురోజుకు అసంతృప్తి పెరుగుతోంది. నామినేటెడ్ పదవుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ, ఎమ్మెల్సీ పదవుల ఎంపిక వంటి విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో టిపిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తాజాగా సమావేశం అయ్యారు. ఎప్పటి మాదిరిగానే దీనికి కసరత్తు అనే పేరు పెట్టారు. గడువు ముగిసిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల రెన్యువల్, త్వరలో ఖాళీ కానున్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు, రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాలను గెలవాలన్న సీఎం ఆదేశాల వరకు అన్ని చర్చలకి పరిమితం అయ్యాయి. ఇలా సమావేశాలు ముగిసిన ప్రతిసారి త్వరలోనే నిర్ణయం అనే ప్రకటన తప్ప.. క్షేత్రస్థాయిలో అడుగు ముందుకు పడటం లేదు.

మూడేళ్లు అవుతున్నా…

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది. కానీ పదవుల భర్తి వ్యవహారం ఎప్పటికీ పరిష్కారం కానీ శాశ్వత సమస్యల మారిపోయింది. నామినేటెడ్ పోస్టుల భర్తీ పై ఇప్పటికే పదుల సంఖ్యలో కమిటీలు, వందల గంటల అంతర్గత చర్చలు జరిగాయి. అధిష్టానం వద్దకు జాబితాలు వెళ్లడం, మళ్లీ వెనక్కి రావడం కామన్ గా మారిపోయింది. పార్టీ కష్టకాలంలో జెండాలు మోసి, కేసులను ఎదుర్కొన్న చాలామంది ద్వితీయ శ్రేణి నాయకులు, ఆశావహులు తమకు ఎప్పుడు న్యాయం జరుగుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఒకరి వర్గానికి పదవి ఇస్తే మరొకరు అలిగి తిరుగుబాటు చేస్తారన్న అంతర్గత భయాలు, లాబీయింగ్ నడుమ ఒక్క నిర్ణయం తీసుకోవడానికి కూడా అగ్ర నాయకత్వం నెలల తరబడి తట పటాయిస్తోంది. తీవ్ర కాలయాపన చేస్తోంది.

పట్టభద్రుల ఎమ్మెల్సీలపై…

రాష్ట్రంలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీలకు సంబంధించి ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ తప్పక గెలవాలని సీఎం రేవంత్ గట్టిగానే నిర్దేశిస్తున్నారు. కానీ పార్టీ యంత్రాంగంలో మాత్రం ఆ స్థాయి కదలిక కనిపించడం లేదు. నిరుద్యోగ పట్టభద్రుల్లో ప్రభుత్వం పై ఉన్న అసంతృప్తి, ప్రత్యర్థుల వ్యూహాలకు దీటుగా ఎదుర్కొనే ప్రణాళికలు క్షేత్రస్థాయిలో లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. గవర్నర్ కోటా కింద ఖాళీ కాబోయే ఎమ్మెల్సీ సీట్ల కోసం ఇప్పటి నుంచే డజన్ల కొద్ది సీనియర్లు ఢిల్లీ నుంచి గల్లీ దాకా పైరవీలు చేస్తున్నారు. ఆశావహుల ఒత్తిడి, సమీకరణల చిక్కుముడులతో డెడ్లైన్లు మీద పడుతున్న.. ఏ ఒక్క స్థానాన్ని ఏకాభిప్రాయంతో తేల్చలేని సంక్షోభం స్పష్టంగా కనిపిస్తోంది.

నిర్ణయాలు సరిగ్గా లేక…

కాంగ్రెస్ పార్టీలో ఒక నిర్ణయం సజావుగా తీసుకోలేకపోతున్నారు. ఒక నిర్ణయం తీసుకోవాలంటే వర్కింగ్ ప్రెసిడెంట్లు, మంత్రులు, పీసీసీ చీఫ్, సీఎం.. వీరి ఆమోదం తర్వాత మళ్లీ ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ, హై కమాండ్ అనుమతులు కావాలని సుదీర్ఘ ప్రక్రియ పార్టీని నిలువునా స్తంభింప చేస్తోంది. అధికారంలో ఉన్నప్పటికీ నిర్ణయాధికారంలో దూకుడు ప్రదర్శించ లేకపోవడం.. ఒక చిన్న కార్పొరేషన్ పోస్టు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం వరకు ప్రతి అంశాన్ని అపరిస్కృతంగా నాన్చడం కాంగ్రెస్ మార్కు రాజకీయ వైఫల్యంగా కొనసాగుతోంది. ముఖ్యమంత్రితో పాటు టీపీసీసీ చీఫ్ సమావేశాలు ఎన్ని జరిగినా.. ఫలితం మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టు మారుతోంది. నిర్ణయాలు తీసుకోలేకపోవడమే అసలైన కాంగ్రెస్ సంస్కృతి అని పార్టీ క్యాడర్ నిట్టూర్చుతోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. కడపలో ఉద్రిక్తత.. వైఎస్సార్‌సీపీ ఎంపీ అవినాష్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు!
  2.  సవతి తల్లిపై డీజిల్ పోసి నిప్పంటించిన కుమారుడు.. చికిత్స పొందుతూ మృతి!
  3. రూ.20 వాటర్ బాటిల్ కోసం దారుణం.. వ్యక్తిని కొట్టి చంపిన నలుగురు!
  4.  సౌదీలో డ్రోన్ దాడి కలకలం.. మృతుల్లో భారతీయుడు!

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు