Homeఅంతర్జాతీయంఫ్రాన్స్ లో అల్లర్లు...!ముస్లింల వలసదారులే కారణమా...?

ఫ్రాన్స్ లో అల్లర్లు…!ముస్లింల వలసదారులే కారణమా…?

  • అంతర్జాతీయ సమాజంలో మరో రచ్చ

  • ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం ఎంత…?

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : అంతర్జాతీయ సమాజంలో ఏదో ఒక అంశం రగులుతూనే ఉంది. తాజాగా ఫ్రాన్స్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. హింసాత్మక నిరసనలు అంతర్జాతీయంగా చర్చకు దారితీస్తున్నాయి. ఆర్థిక సంక్షోభం, పెరిగిన నిత్యవసర ధరలు, విద్యావ్యవస్థలోని బడ్జెట్ కోతలు, ప్రభుత్వ వ్యయాలకు వ్యతిరేకంగా.. విద్యార్థులు, పౌరులు చేపడుతున్న ఆందోళనలు పక్కదారి పడుతున్నాయి. ఆస్తుల విధ్వంసంతో పాటు పోలీసులతో ఘర్షణకు దారితీస్తున్నాయి. అయితే ఈ ఆర్థిక, సామాజిక అంశాల ఆధారంగా మొదలైన ఉద్యమానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సరికొత్త రంగు పులిమారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న ఈ ఘర్షణలకు సరిహద్దులు లేని వలసలు, ఇస్లాం వ్యాప్తి కారణమని వ్యాఖ్యానించారు. ఫ్రాన్స్ అదుపుతప్పిపోతోందని.. ప్యారిస్ త్వరలోనే ముస్లిం నగరంగా మారిపోతోందని ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

అంతర్జాతీయ వ్యూహంలో భాగమే…

అంతర్జాతీయ వ్యూహాలకు అనుగుణంగానే ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పక్కా అంతర్జాతీయ, దేశీయ రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయి అనేది వారి మాట. యూరప్ వలస విధానాలు ఉదారంగా ఉంటాయి. ఈ విధానాలను ఎండబెట్టడం ఆయన ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ఇది పాఠశాలల సమస్య లేదా విద్యార్థుల సమస్య కాదు. ఫ్రాన్స్ ను ఇస్లాం ఆక్రమించుకోవడానికి జరుగుతున్న కుట్ర, మాక్రోన్ ఎప్పుడో సరిహద్దులు మూసివేసి ఉండాల్సింది అని ట్రంప్ వ్యాఖ్యానిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లో ముస్లిం వలసదారులే సర్వ అనర్థాలకు మూలం అనే భావజాలాన్ని మళ్లీ నొక్కి చెప్పే ప్రయత్నాలు చేశారు.

ప్రజాగ్రహానికి అవే కారణాలు…

ఫ్రాన్స్ లో అల్లర్లకు కేవలం ముస్లింలను లేదా వలసదారులను మాత్రమే బాధ్యులను చేయడం ఎంత మాత్రం సహేతుకం కాదు అనేది విశ్లేషకుల మాట. ఇది కేవలం వాస్తవాలను పక్కదోవ పట్టించడమేనని వారు చెబుతున్నారు. ఫ్రాన్స్ ఎదుర్కొంటున్న దాదాపు 119 శాతం జీడీపీ స్థాయి జాతీయ రుణం, ఐదు శాతం కంటే ఎక్కువ ఉన్న బడ్జెట్ లోటు, ద్రవ్యోల్బణం వల్ల దిగజారిన జీవన ప్రమాణాలు ఈ ప్రజాగ్రహానికి ప్రధాన కారణం. ఈ ఆర్థిక ఇబ్బందుల వల్ల రోడ్ ఎక్కిన నిరసన కారులో అన్ని వర్గాలు, విద్యార్థులు, కార్మిక సంఘాల ప్రతినిధులు ఉన్నారు. అశాంతిని ఆసరాగా చేసుకుని కొన్ని ఆకతాయి మూకలు, తీవ్రవాద ధోరణి ఉన్న ముఠాలు హింసకు, లూటీలకు పాల్పడుతున్నాయి. దానిని ఒకే మతానికి రుద్దడం సరికాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫ్రాన్స్ లో ముస్లిం జనాభా విస్తరణ, వారు సమాజంలో భాగం లేకపోవడం వల్ల కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. ప్యారిస్ శివారు ప్రాంతాల్లో పేద వర్గాలు నివసించే ప్రాంతాల్లో ప్రభుత్వం పై దశాబ్దాలుగా ఉన్న అసంతృప్తి ఈ అల్లర్లలో వేరే రూపంలో బయటపడింది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. రజనీ – కమల్ క్రేజీ ప్రాజెక్ట్ షురూ.. వచ్చే నెలలోనే షూటింగ్ ప్రారంభం?
  2.  ఏపీలో వాయుగుండం కలకలం.. నేటి నుంచి విస్తారంగా భారీ వర్షాలు!
  3.  వైభవ్‌ను టీమ్‌ఇండియా నుంచి రిలీజ్ చేయాలా?.. ఆకాశ్ చోప్రా కీలక సూచన!t
  4.  కారు రూఫ్‌పై వ్యక్తిని కిలోమీటరున్నర తీసుకెళ్లి.. ఆపై కారుతో తొక్కించి హత్య!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు