
క్రైమ్ మిర్రర్, వలిగొండ:- యాదాద్రి భువనగిరి జిల్లా,వలిగొండ మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు వలిగొండ పట్టణ కేంద్రంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో వివిధ రాజకీయ పార్టీలు,యువజన సంఘాలు,కుల సంఘాలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. గ్రామపంచాయతీలో సర్పంచ్ కుంభం వెంకట్ పాపిరెడ్డి, తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ జి దశరథ, పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ గౌడ్,మండల పరిషత్ కార్యాలయంలో జలేందర్ రెడ్డి, వ్యవసాయ కార్యాలయం వద్ద అంజని దేవి,వర్కింగ్ జర్నలిస్ట్ కార్యాలయం మరియు ఉద్యమకాల ఫోరం ఆధ్వర్యంలో మారగోని శ్రీనివాస్ గౌడ్,మాల మహానాడు ఆధ్వర్యంలో కూచుమల్ల నాగేష్, కల్లుగీత కార్మిక సంఘం కార్యాలయం లో కొండూరు అంజయ్య గౌడ్ జెండా ఎగరవేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు వాకిటి అనంతరెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు బంధారపు లింగస్వామి,మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి,జిల్లా కాంగ్రెస్ నాయకులు బత్తిని లింగయ్య,సహదేవ్ గౌడ్,లు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న,ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శీలం స్వామి,సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి,కాసుల వెంకన్న,సాయిని యాదగిరి,మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు పేరుమండ్ల యాదగిరి,రాపోలు పవన్ కుమార్,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బత్తిని వరుణ్,కొండూరు సాయి,ఎక్కలదేవి శ్రీనివాస్,తదితరులు పాల్గొన్నారు.
Read also : ఎస్సై సైదా బాబుకు ‘ఉత్తమ సేవా పురస్కారం’
Read also : UAE Cancels Pak Deal: భారత్ తో కీలక సంబంధాలు.. పాక్ కు షాకిచ్చిన యూఏఈ!





