
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత జట్టు స్టార్ ప్లేయర్లు అయినటువంటి రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ అభిమానులకు ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే వీరిద్దరూ టి20 మరియు టెస్ట్ ఫార్మేట్ కు రిటైర్మెంట్ ప్రకటించారు. కేవలం వన్డే మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నారు. మరి ఇటువంటి తరుణంలోనే వాళ్లను అభిమానించే అభిమానులు అందరూ కూడా వీరిద్దరిని అసలు చూడలేకపోతున్నాము అంటూ ఆవేదన చెందుతున్నారు.
Read also : ఏంటి ఈ బాడీ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న రోనాల్డో ఫోటో?
ఈ సమయంలోనే తాజాగా ఈ భారత స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఇద్దరు కూడా విజయ్ హజారే ట్రోఫీ 2025-2026 లో ఆడునున్నారు క్లారిటీ వచ్చింది. విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, ఇషాంత్ శర్మ మరియు నవదీప్ సైని ఈ ట్రోఫీ లో ఆడుతారు అని తాజాగా ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధికారికంగా ప్రకటించింది. మరోవైపు ఈ టోర్నమెంట్ తొలి రెండు మ్యాచ్లలో రోహిత్ శర్మ ఖచ్చితంగా ఆడుతారు అని ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారి ఒకరు ప్రకటించారు. కాగా ఈ విజయ్ హజారే ట్రోఫీ డిసెంబర్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా మళ్లీ వీళ్లను ఈ టోర్నీ లో చూడొచ్చు అంటూ ఆనందంలో మునిగితేలుతున్నారు.
Read also : పాండ్య మెరుపు ఇన్నింగ్స్.. ఫ్లయింగ్ కిస్ లతో రెచ్చిపోయిన గర్ల్ ఫ్రెండ్





