
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చినటువంటి అఖండ 2 పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లను రాబడుతుంది. ఒకవైపు సనాతన ధర్మం అంటూనే మరోవైపు బాలకృష్ణ అభిమానులకు ఇది ఒక ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ సినిమాగా నిలిచింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదలకు ముందు ఎన్నో అడ్డంకులు వచ్చినా కూడా ఎట్టకేలకు డిసెంబర్ 12వ తేదీన విడుదల అయ్యి ఈరోజుకి కూడా థియేటర్లలో హావా కొనసాగిస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా ఈనెల 9వ తేదీన ఓటీటీ లోకి రానున్నట్లు సమాచారం అందింది. ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయినటువంటి నెట్ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. కాగా ఈ సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 120 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు సాధించింది. ఇందులో సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి అలాగే పలువురు బాలీవుడ్ నటులు కూడా నటించడం జరిగింది. అఖండ 1 సినిమా లాగానే రెండవ పార్ట్ కూడా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.
Read also : ఈ ఏడాది వరల్డ్ కప్ మ్యాచ్ ల తో ఫ్యాన్స్ కు పండుగే?
Read also : అరుదైన దృశ్యం.. మంచు గుప్పిట్లో రామకృష్ణాపూర్ పట్టణం





