పోలవరం, క్రైమ్ మిర్రర్ః పోలవరం జిల్లాలో పెద్దపులి సంచారం స్థానికుల్లో కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. దండంగి గ్రామం వద్ద నాలుగు లేగదూడలపై పులి దాడి చేసిన ఘటన కలకలం రేపింది.దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం పెద్దపులి వీరవరంలోని కొండ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా పూడిపల్లి, నాగలపల్లి, బోడిగూడెం పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ దూడలను వేటాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. గిరిజన గ్రామాల్లో సైతం బయటకు వెల్లడానికి జంకుతున్నారు. అటవిశాఖ అధికారులు పులిని బంధించడం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. పశువులను కాపాడుకోవడం కష్టంగా మారిందని గిరిజనులు వాపోతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు స్పందించి పులిని బంధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
