Tuesday, February 24, 2026
Homeతెలంగాణఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు వీక్షించి అభినందించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్...

ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలు వీక్షించి అభినందించిన మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి

ఆత్మకూరు,క్రైమ్ మిర్రర్ :- యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు,మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ సాయుధ పోరాట నాయకులు డాక్టర్ ఆరుట్ల కమలాదేవి రామచంద్రారెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ స్థాయి ఆరుట్ల దంపతుల స్మారక క్రీడోత్సవాలను మాజీ ప్రభుత్వ విప్ ఆలేరు తాజామాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వీక్షించి క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కోరారు . క్రీడల్లో గెలుపు ఓటమి సహజమని అన్నారు.అనంతరం గొంగిడి సునీత మహేందర్ రెడ్డిని స్థానిక సర్పంచ్ బీసు ధనలక్ష్మీ చందర్ గౌడ్ శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీసు ధనలక్ష్మీ చందర్ గౌడ్, ఎం ఈ ఓ కె మహాదేవ రెడ్డి , ఉప సర్పంచ్ మజ్జిగ నరేష్ , మాజీ జడ్పీటీసీ సభ్యులు ప్రతికంఠం పూర్ణ చందర్ రాజు , బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్ , బిఆర్ఎస్ జిల్లా నాయకులు యాస ఇంద్రారెడ్డి,బిఆర్ఎస్ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు సోలిపురం అరుణ ఉపేందర్ రెడ్డి,మాజీ ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు,యువజన సంఘాల ప్రతినిధులు,విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Crime News: లవర్‌ ఫ్యామిలీని ఇంప్రెస్ చేసేందుకు ప్లాన్, సీన్ కట్ చేస్తే కటకటాల్లోకి!

Vedanta: 75 శాతం సంపాదన దానం చేస్తా.. వేదాంతా అధినేత అనిల్ కీలక ప్రకటన!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments