క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- భారత జట్టు టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తాజాగా తన క్రికెట్ జర్నీ గురించి ఒక స్పెషల్ వీడియోని రిలీజ్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ జట్టులోకి వచ్చి దాదాపు 5 సంవత్సరాలు పూర్తయింది అని బాగోద్వేగానికి గురయ్యారు. ఈ ఐదు సంవత్సరాలలో నా జీవితం మొత్తం మారిపోయింది అని.. ఈరోజు కెప్టెన్ గా t20 వరల్డ్ కప్ నెగ్గడం అనేది నేను చేసుకున్న అదృష్టం అని వ్యాఖ్యానించారు. భారత జట్టుకు ఏ సమయంలోనైనా సరే ముందు ఉంటాను అని తెలియజేశారు. ఐదేళ్ల క్రితం వరకు ఒకలా ఉండేవాడిని..ఇప్పుడు వేరోలా ఉన్నాను అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి భారత జట్టు జెర్సీని ధరించిన క్షణాలను మాటల్లో వివరించలేను అని అన్నారు. మన దేశం కోసం మన దేశంలోని క్రికెట్ అభిమానించే అభిమానుల కోసం నిరంతరం కష్టపడుతూనే ఉంటాను అని.. మన దేశం జ్ఞాపకాలకు ఎప్పుడూ కూడా ముందు ఉంటాను అని అన్నారు. సూర్య కుమార్ యాదవ్ భారత జట్టు టి20 కెప్టెన్ గా అతని సారథ్యంలోనే తాజాగా టి20 వరల్డ్ కప్ కూడా నెగ్గిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ తరుణంలోనే గత ఐదు సంవత్సరాల జ్ఞాపకాలను తలుచుకుంటూ సూర్యకుమార్ యాదవ్ బాగోద్వేగానికి గురయ్యారు. అలాగే అద్భుతమైన ప్రదర్శన కనబరిచేటువంటి ప్లేయర్లను అభిమానులు వారి గుండెల్లో పెట్టుకుంటారు అని అన్నారు. ప్లేయర్లకు కష్ట సమయాల్లో కూడా భారత క్రికెట్ అభిమానులందరూ అండగా నిలుస్తారు అని అన్నారు.
Big Breaking: సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) లకు ఒకేసారి పదోన్నతి అవకాశం..!
నేటికీ 13 ఏళ్లు.. జనసేన స్పెషల్ వీడియోలో ఏముందో తెలుసా?
