
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :-
మహారాష్ట్రలోని పూణే నగరంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిన్న సాయంత్రం నవాలే బ్రిడ్జి ఏరియాలో ఈ ప్రమాదం చోటు చేసుకోగా… అక్కడికక్కడే 8 మంది మృతి చెందారు. ఒక ట్రక్కు పలు వాహనాలను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు మరియు వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక అసలు వివరాల్లోకి వెళితే… మహారాష్ట్రలోని పూణే నగరంలో సెల్ఫీ పాయింట్ అయినటువంటి నవాలే బ్రిడ్జ్ ఏరియాలో ఒక ట్రక్కు పలు వాహనాలను ఢీ కొట్టింది. వెంటనే ఆ ట్రక్కులో మంటలు రాగా ఆ మంటలు వ్యాప్తికి దగ్గరలో ఉన్నటువంటి మరో ఆరు వాహనాలు పూర్తిగా అగ్నిలో కాలిపోయాయి. వీటికి సంబంధించి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఈ ఘటనపై అధికారులు ఇప్పటికే అన్ని వివరాలను దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మంది మృతి చెందగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికారులు వివరించారు. మంటల్లో చిక్కుకున్నటువంటి ట్రక్కు ముందు ఉన్నటువంటి వాహనాలను ఢీకొట్టడంతోనే పూర్తిగా ముందున్న వాహనాలు కూడా దగ్ధమయ్యాయి. కాగా ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడినవిస్ ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున పరిహారము ప్రకటించారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా పలు చోట్ల భారీ రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలలో ఎంతో మంది మృతి చెందారు. అధికారులు ఎన్నో విధాలుగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా కఠినమైన రూల్స్ పెట్టినప్పటికీ ఇలా జరుగుతుండడంతో ప్రజలు రోడ్లమీద ప్రయాణాలు చేయాలంటే భయపడుతున్నారు.
Read also : గెలుపు ఎవరిదో కొన్ని గంటల్లోనే తేలనుంది.. వేగమైన ఫలితాల కోసం మీ క్రైమ్ మిర్రర్!
Read also : ఒకవైపు కౌంటింగ్.. మరోవైపు అభ్యర్థి మృతి!





