- పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
పెద్దపల్లి, క్రైమ్ మిర్రర్:పత్తి కొనుగోలు విషయంలో రైతులు చాలా టెన్షన్ తో ఉన్నారని, రైతులు ఆందోళన చెందవద్దని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీక్రిష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పత్తి కొనుగోలు విషయంలో సీసీఐ అధికారులతో మాట్లాడినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మార్చి 15 వరకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలోని కోటపల్లి ప్రాంతంలో ఫ్యాక్స్ ఫిగర్లు ఆలస్యంగా నమోదవుతున్న విషయం సీసీఐ సీఎండీ దృష్టికి తీసుకెళ్లానని, ఈ మేరకు ఆయన సానుకూ లంగా స్పందించినట్లు ఎంపీ పేర్కొన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందవద్ద ని పత్తి రైతులకు భరోసా కల్పించారు.
