
మునుగోడు, క్రైమ్ మిర్రర్:- ఎన్కౌంటర్లు చేయడం ప్రభుత్వ హత్యలు అని మాజీ సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు మిరియాల వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. భారతదేశంలో ఖనిజ సంపద ను ,కార్మిక వర్గాలకు రైతాంగానికి దోపిడీకి గురయ్యే వర్గానికి అండగా ఉంటున్న మావోయిస్టులను దొంగచాటు దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. భారతదేశంలో ఖనిజ సంపదను దోచుకొనుటకు ప్రజలకు అండగా వుండే మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేసి చంపుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. 70 శాతం మంది ప్రజలకు సానుభూతిగా నిలిచారని గుర్తుకు తెచ్చారు. ప్రజల కోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాడుతున్న వారిపై కాల్పులు జరపకుండా చట్టపరమైన కేసులు పెట్టాలి కానీ, ఎన్కౌంటర్ చేయొద్దని, ఎన్కౌంటర్లు చేయడం ప్రభుత్వ హత్యలుగా ప్రజలు భావిస్తున్నారని కేంద్ర ప్రభుత్వం, ఎన్కౌంటర్లు నిలిపివేయాలని కోరారు.
Read also : బువ్వకు వేలాయే…ఖాతాదారులపై గరమయ్యే..!!
Read also : మాతృదేవోభవ అనాధ ఆశ్రమం ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ చేసిన సర్పంచ్





