Tuesday, February 24, 2026
Homeఆంధ్ర ప్రదేశ్భూముల రిసర్వే రెండేళ్లకు పెంచేలా కసరత్తు : డిప్యూటీ స్పీకర్

భూముల రిసర్వే రెండేళ్లకు పెంచేలా కసరత్తు : డిప్యూటీ స్పీకర్

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూముల రి సర్వే పై రైతులు అభ్యంతరాలు తెలపడంతో తాజాగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భూముల రీ సర్వేపై రైతుల అభ్యంతరాల పరిష్కారానికి ఎమ్మార్వో స్థాయిలో ప్రస్తుతం ఏడాది పొడవున గడువుండగా.. దీనిని రెండేళ్ల పాటు పెంచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తాము అని డిప్యూటీ స్పీకర్ రఘు రామకృష్ణారాజు పేర్కొన్నారు. మొత్తం 16,000 గ్రామాలలో ఇప్పటివరకు 6688 గ్రామాలలో రీసర్వే పూర్తయిందని అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం గ్రామాల నుంచి దాదాపు 7 లక్షల అభ్యంతరాలు రాగా అందులో రెండు లక్షల అభ్యంతరాలు పరిష్కారం అయ్యాయని డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు. మిగతా అన్ని గ్రామాల్లో రీ సర్వే పూర్తి చేయాల్సిన సందర్భంలో ఎన్నో అభ్యంతరాలు వస్తాయి కాబట్టి వాటిని మొత్తాన్ని కూడా 2027 డిసెంబర్లో గా పారదర్శకంగా పూర్తి చేస్తామని డిప్యూటీ స్పీకర్ రఘురాం కృష్ణరాజు తెలిపారు.

Read also : WhatsApp: అందుబాటులోకి షెడ్యూల్ కాల్ ఫీచర్

Read also : Ilaiyaraaja: సోషల్‌ మీడియాలో ఇళయరాజా ఫొటో వాడొద్దు, హైకోర్టు తీర్పు!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments