Weather: ముందే రుతుపవనాలు, మేలోనే వానలు.. ఏంటీ వింత వాతావరణం?

0
273
Early Monsoon In India Why Is It Raining In May
Early Monsoon In India Why Is It Raining In May

Indian Weather 2025: సాధారణంగా మే అనగానే ఎండలు మండిపోతాయి. పొద్దున్నుండే భానుడు విరుచుకుపడుతాయి. విపరీతమైన ఎండలు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతారు. గత ఏడాది జూన్ రెండో వారంలోనూ రుతుపవనాలు పలకరించకపోవడంతో ప్రజలు వేడిని తట్టుకోలేకప అవస్థలు పడ్డారు. ఈసారి కూడా పరిస్థితి అలాగే ఉంటుందని అందరూ భావించారు. గతానికి మించి ఈసారి ఎండల తీవ్రత ఉంటుందనుకున్నారు. కానీ, పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. నైరుతి రుతుపవనాలు ముందే రావడంతో అకాల వర్షాలు మొదలయ్యాయి. మే నెల ఎండలు మండాల్సింది పోయి, ఆకాశం మేఘాల ముసుగేసుకుంది. వేసవిలోనే చల్లదనం మొదలయ్యింది.

అత్యతం వేడి సంవత్సరంగా 2024

నిజానికి 2024 అత్యంత వేడి సంవత్సరంగా గుర్తింపు తెచ్చుకుంది. మే, జూన్ నెలల్లో అనేక ప్రాంతాల్లో వేడి గాలులు, ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. వాగులు, వంకలు, రిజర్వాయర్లు ఎండిపోయాయి. కరువు పరిస్థితులు కనిపించాయి. కానీ, 2025 అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఎండల తీవ్రత పెరిగే సమయానికే వేసవి ముగిసింది. చాలా ప్రాంతాల్లో వాతావరణం చల్లబడింది.

Read Also: బ్యాంకులో 59 కిలోల బంగారం మాయం, అసలేం జరిగిందంటే?

వేసవి ముందే ముగియడం మంచిదేనా?

ప్రస్తుత వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముందస్తుగానే తేమ గాలులు వీచడం, గాలి నమూనాలు మారడంతో పాటు రుతుపవనాల కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గాయి. చాలా ప్రాంతాలు మేఘావృతమైన వాతావరణం, అప్పడుప్పుడు కురిసిన వర్షాలతో వేడి తీవ్రత పూర్తిగా తగ్గింది. అయితే, వేసవి ముందే ముగియడం మంచిదేనా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మున్ముందు కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయ చక్రం దెబ్బతినే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే పంటల పెరుగుదల మీద ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటున్నారు నిపుణులు. రైతులు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలని సూచిస్తున్నారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా నాణ్యమైన విత్తనాలను ఎంచుకోవాలంటున్నారు. ఈ ఏడాది వేసవి ప్రారంభం అయినప్పటి నుంచి వేడి నుంచి తరచుగా ఉపశమనం కలిగినా, దేశంలో వాతావరణానికి సంబంధించి మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? అనేది చూడాలంటున్నారు.

Read Also:  టీచర్ తిట్టడం ఆత్మహత్యకు ప్రేరేపించడం ఎలా అవుతుంది? సుప్రీంకోర్టు ఆగ్రహం!