
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు డ్రైవర్లకు కొన్ని విజ్ఞప్తులు చేస్తున్నారు. “డ్రైవర్ అన్నలు కాస్త బస్సులను మెల్లిగా నడపండి… ప్రయాణికులైన మమ్మల్ని భద్రతగా గమ్యానికి చేర్చండి”.. అంటూ సోషల్ మీడియా వేదికగా చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఎందుకంటే గడచిన ఒక నెలలోపే పలు బస్సు ప్రమాదాలు జరగగా.. పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు రోడ్డు ప్రమాదాలపై ఎప్పటికప్పుడు దిశా నిర్దేశాలు చేయాలనీ కోరారు. ఎందుకంటే… ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సు డ్రైవర్లు కూడా వేగంగా వెళ్తున్నారు అని సామాన్య ప్రయాణికులు అధికారులకు ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా హైదరాబాదు, విశాఖపట్నం లాంటి పలు ముఖ్య నగరాలలో ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి కొంతమంది మద్యం సేవిస్తూ, అతివేగంతో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లో మహిళలకు ఫ్రీ బస్సు అందించడం తో బస్సులలో రద్దీ కూడా విపరీతంగా పెరిగిపోయింది.. దీనివల్ల ప్రమాదం జరిగితే అధిక మంది మృతి చెందుతున్నారు అని అంటున్నారు. బస్సులలో రద్దీ పెరగడం కారణంగా బస్సులు నడుపుతున్నటువంటి డ్రైవర్లు, కండక్టర్లు విపరీతంగా ఒత్తిడికి గురవుతున్నామంటూ ఈ మధ్య ప్రభుత్వాలకు తెలిపిన విషయాలు కూడా మనందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ప్రభుత్వం బస్సుల సంఖ్యను పెంచడం లేదా కొన్ని కఠిన చర్యలు తీసుకోవాల్సిన సందర్భం ఆసన్నమైంది అని కోరుతున్నారు.
Read also : హఠాత్తుగా వర్షాలు… కోలుకోలేకపోతున్న ప్రజలు!
Read also : ఆలయాల్లో తొక్కిసలాట ఘటనలు .. భక్తులు ఇవి పాటించాల్సిందే!





