మనం ఆరోగ్యంగా ఉండటానికి నీరు తాగడం ఎంతో అవసరం. అయితే నీరు తాగే పద్ధతిలో చాలామంది తీవ్రమైన పొరపాట్లు చేస్తున్నారని ఆరోగ్య నిపుణులు, వైద్యులు హెచ్చరిస్తున్నారు.
చాలామంది రోజంతా సరిగ్గా నీరు తాగకుండా, ఒకేసారి పెద్ద బాటిల్ నీటిని తాగేస్తుంటారు. ఇలా ఒకేసారి అధిక మొత్తంలో నీరు తాగడం వల్ల కిడ్నీలపై తీవ్రమైన ఒత్తిడి, భారం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ అలవాటు వల్ల శరీరంలో మూత్ర ఉత్పత్తి ఒక్కసారిగా పడిపోతుంది తప్ప, శరీరానికి లభించే పూర్తి ప్రయోజనం లభించదు.నీటిని ఒకేసారి తాగడానికి బదులుగా, రోజంతా కొద్దికొద్దిగా తాగుతూ శరీరాన్ని ఎల్లప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ శరీరంలో డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజంతా క్రమం తప్పకుండా, తగిన మోతాదులో నీరు తాగడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం.ఆరోగ్యకరమైన అలవాట్లతో సమయానుకూలంగా నీటిని తాగుతూ కిడ్నీలను భద్రంగా కాపాడుకోండి.
