Homeక్రీడలునేడు డబుల్ ధమాకా... గెలిచే అవకాశం ఈ జట్లదే!

నేడు డబుల్ ధమాకా… గెలిచే అవకాశం ఈ జట్లదే!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- ఐపీఎల్ లో భాగంగా ఈరోజు ఆదివారం కావడంతో రెండు మ్యాచులు జరగనున్నాయి. ఇందులో భాగంగానే మొదటి మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ మరియు గుజరాత్ టైటాన్స్ మధ్య కీలక పోరు 3:30 గంటలకు జరగనుంది. ఇరుజట్లు కూడా మూడు మ్యాచ్లు గెలిచాయి. ఈ సీజన్లో ఈ రెండు జట్లు గెలుపు ఓటములను చవిచూస్తూ ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం చెన్నై పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో ఉండగా గుజరాత్ టైటాన్స్ ఏడో స్థానంలో ఉంది. ఇరుజట్ల గెలుపు విషయానికి వస్తే ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కే విజయ అవకాశాలు ఎక్కువ.

Swati Maliwal: ఆప్‌లో కల్లోలం, బీజేపీలోకి స్వాతి మాలివాల్.. కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు!

ఇక మరోవైపు రాత్రి 7:30 గంటలకు పాయింట్స్ టేబుల్ లో చివర ఉన్నటువంటి కోల్కతా మరియు లక్నో మధ్య హోరాహోరీ మ్యాచ్ జరగనుంది. ఈ ఏడాదిలో ఈ రెండు జట్లు చాలా బలహీనంగా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు లక్నో జరిగిన ఏడు మ్యాచ్ల్లో రెండు మ్యాచ్లు మాత్రమే గెలవడం, మరోవైపు కోల్కత్తా కేవలం ఒక మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. దీంతో ఈ ఇరు జట్లకు విజయం అనేది చాలా కీలకం కానుంది. ఇరుజట్ల ప్రదర్శన చూసుకుంటే కోల్కత్తా కన్నా లక్నో కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఈరోజు జరుగుతున్నటువంటి రెండు మ్యాచ్లలో ఏ జట్లు విజయం సాధిస్థాయో అనే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

కామారెడ్డిలో దారుణం…భార్య చేతిలో భ‌ర్త హ‌త్యా…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు