
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- ప్రస్తుత రోజుల్లో డబ్బుకు ఎంత విలువ ఉంది అనేది ప్రత్యేకంగా మనం చెప్పనవసరం లేదు. ఈ రోజుల్లో గౌరవ మర్యాదలు కన్న డబ్బుకి ఎక్కువగా విలువిస్తున్నారు. ఇక మరోవైపు ఎక్కువ డబ్బు ఎవడి చేతిలో ఉంటే వాడిదే రాజ్యం ఉన్నట్లుగా కాలం కూడా మారిపోయింది. కాబట్టే భవిష్యత్తులో రాజ్యాలు ఏల లేకపోయినా కనీస అవసరాలకు ఉపయోగపడేలా డబ్బులను ఆదా చేయాలి అని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అలా చేయని పక్షంలో భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని.. డబ్బులు అత్యవసరమైనప్పుడు బంధువులు కూడా దగ్గరకు రారు అన్న నిజం తెలుసుకోవాలి అని అంటున్నారు. అలాగని డబ్బు ఎలా ఆదా చేయాలి అని ఓ ప్రశ్నలు వేసుకోకండి. సరిగ్గా కూర్చుని ఆలోచిస్తే అనవసరపు ఖర్చులన్నీ మీకు ఇన్వెస్ట్ రూపంలో మారుతాయి. మనకు తెలియకుండానే మన డబ్బు అనవసరపు ఖర్చుల రూపంలో వృధా అవుతున్న సందర్భాలు ప్రతి ఒకరిలోనూ చూస్తుంటాం. కాబట్టి ఇప్పటినుంచి కొన్ని ట్రిప్స్ పాటించి.. అనవసరపు డబ్బులను వృధా చేసుకోకండి. ఇప్పుడు చెప్పబోయే కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకొని డబ్బులను ఆదా చేసుకోండి.
Read also : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం…!
అనవసరంగా వినియోగించినటువంటి సోషల్ మీడియా యాప్స్ సబ్స్క్రిప్షన్ తీసుకోకండి. ఎప్పుడూ ఒకసారి వెళ్లేటువంటి జిమ్ మెంబర్షిప్ విషయంలో కూడా జాగ్రత్త పడండి. అలాగే ఇంట్లో భోజనం మానేసి బయటికి వెళ్లి ఖరీదైనటువంటి ఆయిల్ ఫుడ్స్ అలాగే కాఫీలు అంటూ అలవాటులు ఉన్నవాళ్లు కాస్త తగ్గించుకోండి. బ్యాంకు చార్జీల పట్ల కూడా కాస్త ఆలోచన చేయండి. మీరు ఉదయం నుంచి రాత్రి వరకు చేసే ప్రతి పనులోనూ అనవసరంగా డబ్బులను వృధా చేస్తున్నారు. కాబట్టి ప్రతి విషయంలోను ఎంతవరకు ఆదా చేసుకోగలిగితే అంత మంచిది.
Read also : మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం…!





