అంతర్జాతీయం

మరో 25 శాతం టారిఫ్ పెంపు, భారత్ పై ట్రంప్ అక్కసు!

Trump 50% Tariff: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. ఇప్పటికే 25 శాతం టారిఫ్ విధించగా, తాజాగా మరో 25 శాతం పెంచుతున్నట్లు వెల్లడించారు. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు గాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతేకాదు, భారత్‌ పై మొత్తం 50 శాతం టారిఫ్‌లు విధిస్తూ ట్రంప్ సంతకం చేశారు.

ప్రపంచ దేశాలపై ప్రతీకార సుంకాలు

నిజానికి అమెరికా అధ్యక్షుడు అయ్యాక ట్రంప్ ప్రపంచంలోని పలు దేశాలపై ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే భారత్‌పై టారిఫ్ లు విధించారు. రష్యాతో భారత్ సన్నిహితంగా ఉండడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. రష్యా నుంచి చౌకగా ఆయిల్ ను భారత్ కొనుగోలు చేస్తోంది. దాన్ని శుద్ధి చేసి భారత్ మళ్లీ అమ్ముతుంది. భారత్ మంచి లాభాలు పొందుతుంది. దీన్ని చూసి ట్రంప్ కడుపు మండుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్‌పై మరిన్ని సుంకాలు విధిస్తామని ఆయన ప్రకటించారు. భారత్ కోనుగోలు చేస్తున్న ఆయిల్ కారణంగా.. రష్యాకు భారీగా నిధులు సమకురుతున్నాయని ఆరోపించారు. ఆ నిధులతో ఉక్రెయిన్ ‌పై రష్యా యద్ధం చేస్తుందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే భారత్‌ పై భారీగా సుంకాలు విధిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.

ట్రంప్ తీరును తప్పుబడుతున్న రిపబ్లికన్లు

భారత్ విషయంలో ట్రంప్ వైఖరిని రిపబ్లికన్ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ పార్టీ నాయకురాలు నిక్కీ హేలీ ఈ అంశంపై ట్రంప్ ను సూటిగా ప్రశ్నించారు. భారత్ లాంటి బలమైన మిత్ర దేశాన్ని దూరం చేసుకోవద్దని సూచించారు. “రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేయకూడదు. కానీ.. చైనా చేయవచ్చా?” అంటూ ఆమె ఎక్స్ ఖాతా వేదికగా ప్రశ్నించారు. చైనాకు సుంకాల నుంచి 90 రోజుల్లో మినహాయింపు ఎందుకు ఇచ్చారంటూ? ట్రంప్‌ ను ప్రశ్నించారు. చైనాకు పలు అనుమతులు ఇస్తూ.. భారత్ లాంటి బలమైన మిత్ర దేశానికి ప్రతీకార సుంకాలు పెంచి దూరం చేసుకోవద్దని ట్రంప్‌ కు సూచించారు.

Read Also: భారత్‌ను దూరం చేసుకోవద్దు.. నిక్కీ హేలీ కీలక వ్యాఖ్యలు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button