
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్:- కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ దర్శనం ఇచ్చినటువంటి మోనాలిసా ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే ప్రతి ఒక్కరు కూడా షాక్ అవ్వాల్సిందే. చేతిలో డబ్బు లేకపోయినా కుంభమేళాలో మాత్రం పూసలు అమ్ముకుంటూ తన కళ్ళతో ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించినటువంటి మోనాలిసా ఒక్కసారిగా సోషల్ మీడియా ద్వారా హైలైట్ అవ్వడంతో ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు చేతిలో రేంజ్ రోవర్ తాళాలు పెట్టుకొని కళ్ళకు కళ్ళజోడు పెట్టుకుని, బ్రాండెడ్ దుస్తులు ధరించి విమానాలలో ప్రయాణం చేస్తూ వచ్చి ఏకంగా పలు కార్యక్రమాలలో పాల్గొంటూ, పలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేస్తూ, సినిమాలలో అవకాశాలు తెచ్చుకొని ఈరోజు వేరే లెవల్లో బతుకుతుంది. కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఒక్కసారిగా ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారిన మోనాలిసా క్రేజ్ రోజురోజుకీ కూడా పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్న ఈమె పలు కార్యక్రమాలకు గెస్ట్ గా హాజరవుతూ బాగానే సంపాదిస్తున్నారు. ఇక తాజాగా ఈమె హైదరాబాదులోని ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు. “లైఫ్” అనే తెలుగు సినిమాలో ఇటీవల ఆమెకు ఆఫర్ రాగా ఈ షూటింగ్లో పాల్గొనడానికి ఆమె హైదరాబాద్ వచ్చినట్లుగా ఆమె కొన్ని షూటింగ్ వీడియోలను ఇన్స్టా లో షేర్ చేశారు. దీంతో కుంభమేళా మోనాలిసా మన హైదరాబాదులో అడుగుపెట్టింది అంటూ పలువురు కామెంట్లు అలాగే పోస్టులు చేస్తున్నారు.
Read also : మొదలైన క్రిస్మస్ సెలబ్రేషన్స్.. కానీ ఈ దేశాల్లో మాత్రం నిషేధం!
Read also : భారీ స్థాయిలో బీజేపీ పార్టీకి విరాళాలు.. అత్యల్పంగా ఏ పార్టీకి అంటే?





