హీరో నారా రోహిత్ అలాగే ప్రతినిధి 2 లో హీరోయిన్గా చేసిన సిరిలెల్ల ఇద్దరు కూడా ప్రేమించుకుని నిన్న ఎంతో ఘనంగా హైదరాబాదులోని నోవాటెల్ హోటల్లో ఎంగేజ్మెంట్ జరుపుకున్న విషయం అందరికీ తెలిసిందే. నిన్న జరిగినటువంటి ఎంగేజ్మెంట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయాయి. ప్రస్తుతం నారా రోహిత్ అభిమానులు అలాగే సినీ ప్రియులు కూడా నారా రోహిత్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి అలాగే వాళ్ళ యొక్క ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి అందరూ ఆరాధిస్తున్నారు. మరి ఇప్పుడు తన బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసుకుందాం.
సిరిల్లెల్ల అచ్చమైన మన తెలుగు సాంప్రదాయ ఆడబిడ్డ. మన ఇండియాలోనే బ్యాచిలర్ డిగ్రీ ని పూర్తి చేసుకున్న ఈమె పై చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లి మాస్టర్ చేసింది. సినిమాల మీద ఇష్టం ఉండడంతో ఆస్ట్రేలియా నుంచి మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చింది. ఇక అదే సమయంలోనే ప్రతినిధి టు ఆడిషన్స్ కి వెళ్ళిన ఈ హీరోయిన్ కి ఈ అవకాశం అనేది దక్కింది. దీంతో ఈ సినిమాలో ఇద్దరు కూడా ప్రేమలో పడడం జరిగింది.
ఈ సమయంలోనే నారా రోహిత్ తన పెద్దమ్మ అయినా నారా భువనేశ్వరికి చెప్పడంతో తను వెళ్లి హీరోయిన్ కుటుంబాన్ని కలిసి మాట్లాడి వీరిద్దరి పెళ్ళికి ఒప్పించినట్లు సోషల్ మీడియాలో చాలా కథనాలు వస్తున్నాయి. అయితే హీరోయిన్ సిరిల్లెల్ల ఫ్యామిలీ కూడా పెద్ద కుటుంబం అవడంతో ఇక మరోవైపు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం అవడంతో వాళ్లు కూడా సులభంగా ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ప్రస్తుతం వీళ్ళిద్దరి వివాహమైతే కచ్చితంగా జరుగుతుంది. అయితే సినిమాల్లో నారా రోహిత్ కి అంత పెద్దగా ఫేమ్ లేకపోయినా వీళ్ళిద్దరి పెళ్లి తర్వాత అయిన నారా రోహిత్ కి కలిసి వస్తుందేమో వేచి చూడాల్సిందే.