Tuesday, February 17, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అరిసెల విక్రియాలతో కోటప్పకొండకు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?

అరిసెల విక్రియాలతో కోటప్పకొండకు వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా?

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మహాశివరాత్రి పర్వదినాన కోటప్పకొండ లో లింగ రూపంలో కొలువై ఉన్నటువంటి త్రికోటేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ మహాశివరాత్రి పురస్కరించుకొని ఆలయ అధికారులు భారీ ఏర్పాట్లు కూడా చేశారు. దాదాపు రాష్ట్ర నలుమూలల నుంచి ఏకంగా 20 లక్షలకు పైగానే జనం వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక తాజాగా ఈ ఆలయంలో భక్తులకు అందించేటువంటి అరిసెల ప్రసాదానికి అనూహ్యమైనటువంటి ఆదాయం అలాగే స్పందన లభించింది. తిరుణాల సందర్భంగా ఒక్కరోజే అరిసెల విక్రయాల ద్వారా ఏకంగా 16 లక్షలకు పైగా ఆదాయం వచ్చినట్లుగా ఆలయ ఈవో దాసరి చంద్రశేఖర రావు తాజాగా వెల్లడించారు.

పిల్లలకు 4 గోడల మధ్య చదువు మాత్రమే ముఖ్యం కాదు : నాగబాబు

అదే గత ఏడాది లో ఈ అరిసెల విక్రియల ద్వారా 8.79 లక్షల ఆదాయం రాగా ఈసారి భక్తుల రద్దీ పెరగడం కారణంగా 16.74 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు. దీంతో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఆదాయం రెట్టింపు రావడంతో రికార్డు సృష్టించింది. ఈసారి కోటప్పకొండ జాతరకు అధిక సంఖ్యలో భక్తులు రావడంతో భక్తులతో ఆలయం మొత్తం కిక్కిరిసిపోయింది. ఇక అదే రోజున రాత్రి సమయంలో విద్యుత్ ప్రభల ద్వారా డాన్సులు పాటలతో హోరెత్తగా అక్కడికి వచ్చినటువంటి భక్తులందరు కూడా తెగ సంతోషంలో మునిగిపోయారు. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు జరిగినటువంటి అన్ని పండుగల రోజు ఆయా ఆలయాల ప్రసాదాలకు సంబంధించి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చింది. దీంతో ట్రెండింగ్ లో ఆలయ ప్రసాదాలు నిలుస్తున్నాయి.

ఘ‌నంగా కేసీఆర్ జ‌న్మ‌దిన వేడుక‌లు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments